Ritu Chowdary kissed Dimon Pawan: ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హౌస్ లో బాగా పాపులరైన జంట డిమోన్ పవన్(Demon Pavan) , రీతూ చౌదరి(Ritu Chowdary). ఈ సీజన్ మొత్తం బంధాలు మీదనే నడిచింది. ఎన్నడూ లేని విధంగా అక్కడ తమ్ముడు, నాన్న కూతురు, అమ్మ కొడుకు, అన్నా చెల్లి, ఇలాంటి బంధాల మధ్య రీతూ చౌదరి, డిమోన్ ప్రేమ జంట ఎంతో క్యూట్ గా అనిపించేది. ప్రారంభం లో వీళ్లిద్దరు నిద్ర లేచినదగ్గర నుండి తిట్టుకోవడం, గొడవలు పడడం మాత్రమే జరిగేవి. జనాలకు వీళ్ళిద్దరిని చూసి చాలా చిరాకు కలిగింది. నామినేషన్స్ లోకి ఇద్దరు వస్తే, ఇద్దరినీ పార్సెల్ చేసి బయట పడేయాలి అనే రేంజ్ కోపం రప్పించారు. కానీ రోజులు గడిచే కొద్దీ, పరిస్థితుల అనుభవం రీత్యా వీళ్ళిద్దరిది కూడా స్వచ్ఛమైన రిలేషన్ అని జనాలు నమ్మారు. అందుకే రీతూ చౌదరి కి బయట అంత నెగిటివిటీ ఉన్నా 13 వ వారం వరకు హౌస్ లో ఉన్నింది.
ఇక డిమోన్ పవన్ అయితే ఏకంగా ఇమ్మానుయేల్ ని దాటుకొని టాప్ 3 స్థానం లో నిలిచి 15 లక్షల రూపాయిల సూట్ కేసు తో బయటకు వచ్చాడు. ఇదంతా జరిగి సరిగ్గా వారం రోజులు పూర్తి అయ్యింది. అభిమానులు బిగ్ బాస్ రియాలిటీ షోస్ ని బాగా మిస్ అవుతున్నారు. అయితే ఈ సీజన్ కి సంబంధించిన పది మంది కంటెస్టెంట్స్ తో రీసెంట్ గానే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ షోకి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ జరిగింది. ఈ ఎపిసోడ్ ఈ ఆదివారం టెలికాస్ట్ కానుంది. అయితే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ కి ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ పడాల, డిమోన్ పవన్, భరణి, రీతూ చౌదరి, శ్రీజ, సంజన, దివ్య నిఖిత, సుమన్ శెట్టి, రాము రాథోడ్ హాజరయ్యారు.
ఈ ప్రోమో లో ఇమ్మానుయేల్ మళ్లీ తన కామెడీ ట్రాక్ లో కం బ్యాక్ ఇస్తూ, బయట శ్రీజ చేసిన హంగామా చూసి కప్ గెలిచింది పవన్ కళ్యాణా?, లేదా శ్రీజా నా అనే అనుమానం కలిగింది అని అంటాడు. ఇక శ్రీముఖి డిమోన్ పవన్ తో మాట్లాడుతూ ‘కామనర్ గా అడుగుపెట్టి టాప్ 3 వరకు వెళ్ళావు, నీకు ఎలా అనిపిస్తుంది ‘ అని అడుగుతుంది. ఇక ఆ తర్వాత డిమోన్ పవన్ ‘బిగ్ బాస్ హౌస్ లో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరైనా ఉన్నారా అంటే అది రీతూ మాత్రమే అని అంటాడు. ఇక ఆ తర్వాత రీతూ చౌదరి మాట్లాడుతూ ‘నాకు అతి ముఖ్యమైన నిజాయితీ గల వ్యక్తి డిమోన్ పవన్ మాత్రమే’ అని చెప్పి చివరిలో అతనికి ముద్దు పెడుతుంది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రోమో ని మీరు కూడా చూసేయండి.
