Homeఎంటర్టైన్మెంట్Rithu Varma: "వరుడు కావాలి" హీరోయిన్ ను పెళ్లి ఇప్పుడు అంటూ ప్రశ్నించిన విలేకరులు...

Rithu Varma: “వరుడు కావాలి” హీరోయిన్ ను పెళ్లి ఇప్పుడు అంటూ ప్రశ్నించిన విలేకరులు…

Rithu Varma: టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్ లకు అంత గుర్తింపు ఉండదు అని చెప్పుకోవాలి. తెలుగు అమ్మాయిలు కొంత పరిమిత వరకే హద్దులను దాటుతారు అని సినిమా ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. బహుశా అందుకేనేమో టాలీవుడ్ లో డైరెక్టర్స్ ఎక్కువగా ఇతర హీరోయిన్లను ఎంచుకుంటారు.ఎటువంటి పాత్రలైనా సవాల్గా తీసుకొని విజయం సాధించిన తెలుగు హీరోయిన్ లు కూడా ఉన్నారు వారిలో స్వాతి, అంజలి,రీతు వర్మ .

rithu varma super answers to media in varudu kavalenu movie promotions

పెళ్లి చూపులు చిత్రంతో విజయం అందుకున్నారు రీతు వర్మ.  కేశవ, కనులు కనులను దోచాయంటే వంటి తదితర చిత్రాల్లో నటించారు విజయం అందుకున్నారు ఈ తెలుగు భామ.  తమిళం ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు పొందారు రీతూ. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ఓటిటి విడుదలైన “టక్‌ జగదీష్‌ ” కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. నాగశౌర్య రీతు వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’ ఈ నెల 29న ప్రేక్షకుల అలరించబోతున్న సందర్భంగా  హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు ఈ భామ.

ఈ సంవత్సరంలో విడుదలవుతున్న నా మూడో సినిమా “వరుడు కావలెను”. నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌ చిత్రాలు ఓటీటీలోనే విడుదలయ్యాయి. థియేటర్ వాతావరణాన్ని మిస్ అయ్యాను… వరుడు కావలెను థియేటర్ లో ప్రేక్షకులను అలరించడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు తమిళ సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ భామ.  తెలుగు లో శర్వానంద్‌తో ఓ సినిమా, తమిళంలో మరో చిత్రంలో  నటిస్తున్నారు రీతూ.  ఈ తరుణంలోనే పెళ్లి ఎప్పుడు అంటూ విలేకరులు ప్రశ్నించగా… ఇప్పటిలో వివాహం గురించి ఆలోచనే లేదు అని బదులు ఇచ్చింది. అలానే సినిమాలకి దూరమయ్యే లోపు ఒక్క చారిత్రాత్మక సినిమానైనా చేయాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయట పెట్టారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version