బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ కథ నేపథ్యంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కు మంచి అభిమానం ఉంది. ఇక రిషి వసుతో మాట్లాడుతూ.. మీ దృష్టిలో నేను ఎప్పుడు రాక్షసుడిలా కనిపిస్తాను అని అంటాడు. వసు అలాంటిది ఏమీ లేదు అంటూ.. జగతి మేడం మిమ్మల్ని, మహేంద్ర సార్ ను ఎప్పుడు దూరం చేయాలని అనుకోదని అంటుంది. అలా చేయాలంటే ఈ 20 ఏళ్ళు దూరం ఉండదంటూ.. కానీ మహేంద్ర సార్ తీసుకొచ్చాడు అంటూ అందుకే మీరు ఆమెపై తప్పు పడుతున్నారు అంటూ కాస్త గాటిగానే మాట్లాడుతుంది.
రిషి కూడా ఆ 20 ఏళ్లు నేను కూడా బాధపడ్డాను అంటూ.. నా బాల్యం కోల్పోయాను అంటూ బాధపడతాడు. మా విషయాలు నువ్వు పట్టించుకోవద్దు అంటూ వసుకి వార్నింగ్ ఇస్తాడు. ఇక చివరికి డాడీ ఉన్నాడు అంటూ చెప్పేసరికి వసు సంతోషపడుతుంది. ఇక ఈ విషయాన్ని జగతి మేడంకు చెప్పాలని ఫోన్ చూస్తుండగా రిషి ఆమె ఇంతవరకు చేయలేదు అంటే అప్పుడే డాడీ వచ్చాడన్న విషయం తనకు తెలియవచ్చునని చెబుతాడు. ఇక మహేంద్రవర్మ ఇంట్లో జగతి అన్న మాటలు, రిషి బాధపడిన క్షణాలను గుర్తు చేసుకొని బాధ పడతాడు.
అదే సమయంలో ధరణి వచ్చి మాట్లాడుతుంది. అంతేకాకుండా వసుని దేవయాని తిట్టిన మాటలు చెబుతుంది. ఇక రిషికి, అత్తయ్యకు, వసుకు మీరే అన్ని చూసుకోవాలి అంటూ వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని తెలుపుతుంది. ఇక మహేంద్రవర్మ ధరణి చెప్పింది కరెక్టే అని అనుకుంటాడు. జగతి రిషి మాటలను తలుచుకొని బాధపడుతుంది. అదే సమయంలో మహేంద్ర వర్మ నుండి మెసేజ్ రావడంతో సంతోషపడుతుంది. మరోవైపు మహేంద్రవర్మ దేవయానిని పిలుస్తాడు. దీనిని బట్టి దేవయానిని గట్టిగా నిలదీయాలి అని అనుకుంటున్నట్లు అనిపిస్తుంది.