NTR Rishab Shetty: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్న వారిలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు.ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి విజయాలను సాధించిపెట్టాయి. కానీ పాన్ ఇండియాలో ఆయన చేసిన దేవర సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఇక ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో 1300 కోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టినప్పటికి రామ్ చరణ్ కూడా అందులో భాగమయ్యాడు. కాబట్టి ఆ వాటా ఇద్దరికి వర్తిస్తోంది. ఇక మొత్తానికైతే ఇప్పుడున్న తెలుగు స్టార్ హీరోలందరిలో జూనియర్ ఎన్టీఆర్ చాలా వరకు వెనకబడిపోయాడు. ఇంతకుముందు అల్లు అర్జున్ కంటే ముందు వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ను అలా వైకుంఠపురంలో, పుష్ప సినిమాలతో అల్లు అర్జున్ బ్రేక్ చేసి ముందుకు వచ్చాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇప్పుడు వెనుకబడిపోయాడు. ఇక ఈ మధ్యకాలంలో కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి సైతం ‘కాంతార చాప్టర్ వన్’ సినిమాతో 750 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టాడు.
దాంతో అతను కూడా జూనియర్ ఎన్టీఆర్ ను దాటేసి ముందుకు సాగారు. ఎన్టీఆర్ కి ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ భారీ సక్సెస్ ఏది లేదు కాబట్టి ప్రతి ఒక్క హీరో అతన్ని దాటేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికైనా ఆయన భారీ సక్సెస్ ని సాధించకపోతే మరింత వెనుకబడి పోయే అవకాశం ఉంది. కాబట్టి తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఏది ఏమైనా కూడా రిషబ్ శెట్టి లాంటి హీరో సైతం బ్రేక్ చేయలేకపోవడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయమనే చెప్పాలి. ఇక డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ అవుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక జూనియర్ ఎన్టీఆర్ కి ఇప్పటివరకు ఇండస్ట్రీ హిట్ లేదు. కాబట్టి ఆయన చాలా వరకు వెనుకబడిపోతున్నాడు. ఇక ఇప్పటికైనా ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంటాడా? లేదా ఇప్పటికైనా ఆయన తనను తాను ఎలివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇకముందు రాబోయే హీరోలు సైతం అతన్ని బీట్ చేసి ముందుకు దూసుకెళ్లే ప్రమాదం ఉంది. కాబట్టి తను భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది…