ఎవరు ఏమనుకుంటారో ? అసలు ఈ ప్రపంచం తన గురించి ఏమనుకుంటుందో ? ఇలా పక్కోడు ఎదురింటోడు ఫీలింగ్స్ కామెంట్స్ కోసమే సాధారణ మనిషి సతమవుతూ ఉంటాడు. కానీ అతను డిఫరెంట్, అతని ఆలోచనా విధానం ప్రత్యేకం. ఎవరు ఏమనుకుంటారో అనే విషయాలను అసలు పట్టించుకోడు. బహుశా ఇలాంటి వ్యక్తులు చాల అరుదుగా ఉంటారు.
ఆ వ్యక్తుల్లో ఒక వ్యక్తి ‘రామ్ గోపాల్ వర్మ’. ఆర్జీవీ అనే వింత జీవి ఏమి చేసినా సరి కొత్తగా ఉంటుందనే పేరు అయితే వచ్చింది గానీ, ఇప్పుడు ఆ కొత్తదనం సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం అయిపోయింది. ఆర్జీవీ కంపెనీ నుంచి నెలకి రెండో, మూడో సినిమాలు అయితే వస్తున్నాయి, వెళ్తున్నాయి. దీనికితోడు ఓటిటిల్లో విడుదలవుతున్నాయి కాబట్టి,
రిలీజ్ కి పెద్దగా ఖర్చులు కూడా అవసరం లేకుండా పోయింది. పైగా ఓటీటీల కంటెంట్ పై ప్రేక్షకుల్లో కూడా కాస్త పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ టాక్ ను క్యాష్ చేసుకోవడానికి సదరు ఓటీటీ సంస్థలు అన్నీ ప్రస్తుతం పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఆర్జీవీ చిత్రాల పై ఆసక్తి చూపిస్తున్నాయి. అందుకే తన చిత్రాలను ఎవరైనా చూస్తున్నారా ? అసలు వాటికి రెస్పాన్స్ వస్తుందా ? అన్నది అసలు పట్టించుకోవడం లేదు రామ్ గోపాల్ వర్మ.
తన చిత్రాల జయాపజయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టు ఉంది ఆర్జీవీ వ్యవహార శైలి. అసలు తాను ‘తీస్తున్న’ సినిమాలకు డబ్బులు వస్తున్నాయా ? రావట్లేదా ? లాంటి విషయాలు కూడా ఆర్జీవీ ఆలోచిస్తున్న పాపాన పోవడం లేదు. ఇప్పుడు లెస్బియన్ మూవీ కూడా విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు. ఇలాంటి సినిమా చూసి జనం ఏమనుకున్నా ఆర్జీవీ మాత్రం పట్టించుకోడు. వర్మ మన కర్మ.