KCR Bio-Pic: సినీ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ’ తన వివాదాల స్ట్రాటజీని అలాగే కంటిన్యూ చేస్తూ.. ఆ మధ్య కేసీఆర్ బయోపిక్ ను ప్రకటించాడు. పైగా ”మా భాషమీద .. నవ్వినవ్, మా మొహం మీద ఊసినవ్ .. మా బాడీలమీద నడిచినవ్ .. ఆంధ్రోడా .. వస్తున్నా .. నీ తాట తీయ్యడానికి వస్తున్నా.. ”అంటూ ప్రకటనలోనే వివాదాన్ని రెచ్చగొట్టి మరీ, కేసీఆర్ జీవిత చరిత్రను కూడా క్యాష్ చేసుకోవడానికి కాస్త గట్టిగానే ప్లాన్ చేశాడు.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో గానీ, మళ్ళీ వర్మ.. కేసీఆర్ బయోపిక్ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సహజంగా హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వర్మ తాను చేయాల్సిన సినిమాలను వరుస పెట్టి చేసుకుంటూ పోతాడు. పైగా తన సినిమాకు కాంట్రవర్సియల్ పాయింట్ దొరికితే, ఇక ఆ సినిమాని చచ్చినా వదలడు.
అలాంటి వర్మ కేసీఆర్ బయోపిక్ ను మధ్యలో వదిలేసి.. ఇప్పడు తీరిగ్గా ఈ బయోపిక్ పనులు మొదలెట్టాడట. ఎలాగూ తన సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో బాగా తెలుసు కాబట్టి.. రానున్న రోజుల్లో కేసీఆర్ బయోపిక్ తో సడెన్ షాక్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ బయోపిక్ లో హీరో కేసీఆర్ అయితే, విలన్ ఎప్పటిలా చంద్రబాబునే.

ఇప్పటికే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’, అలాగే ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాల్లో చంద్రబాబును పచ్చి అవకాశవాదిగా ఒక విలన్ గా చూపించాడు. ఇప్పుడు కేసీఆర్ సినిమాలో కూడా అలాగే చూపించబోతున్నాడట. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకున్న వర్మ, ఈ సినిమా డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా శరవేగంగా పూర్తి చేయడానికి మరో దర్శకుడ్ని పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ బయోపిక్ కోసం కొందరు తెరాస పార్టీ కీలక నేతలతో కూడా వర్మ చర్చలు జరిపాడట. మరి ఈ సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయి ? కేసీఆర్ లైఫ్ ను ఎలా చూపిస్తాడో చూడాలి. ఏది ఏమైనా తెలంగాణ సీఎం కేసీఆర్ బయోపిక్ ను త్వరలోనే తీస్తానని వర్మ తాజాగా మళ్ళీ ప్రకటించడం హాట్ టాపిక్ అయింది.
[…] Covid Sanctions: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే కలవరపాటుకు గురి చేసింది. వ్యవస్థలన్నింటిని అతలాకుతలం చేసింది. ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. చిన్న వైరస్ అయినా పెద్ద ఉత్పాతమే సృష్టించింది. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. రెండేళ్లపాటు ప్రజలను నానా తంటాలు పడేలా చేసింది. చైనాలో పుట్టిన వైరస్ మొత్తం ప్రపంచాన్ని గడగడలాడింది. దాని దెబ్బకు అందరు కుదేలయ్యారు. మొదటి విడతలో వృద్ధులు, రెండో విడతలో యువత భారీ మూల్యం చెల్లించుకుంది. ఫలితంగా లక్షలాది ప్రాణాలు గాల్లో కలిశాయి. […]
[…] Pakistan Prime Minister Imran Khan: పాకిస్తాన్.. మన శత్రుదేశంలో ‘ప్రజాస్వామ్యం’ నాలుగు పాదాలపై నడిచి చాలా కాలమైంది. తుపాకీ(సైన్యం) కనుసన్నల్లోనే అక్కడ ప్రజాస్వామ్యం వర్ధిల్లుతోంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో అధికారంలో ఐదేళ్లు కూర్చోవాలంటే సైన్యం చెప్పినట్టు చేయాల్సిందే. లేదంటే దేశాన్ని హస్తగతం చేయడమో.. పాకిస్తాన్ ప్రధానిని పక్కకు తప్పించడమో చేస్తుంటారు. కొన్ని సార్లు ప్రధాని అభ్యర్థుల హత్యలు జరిగాయంటే సైన్యం పాత్ర ఎంత పవర్ ఫుల్ నో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడూ అదే జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ జనరల్ తో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు చెండింది. దీంతో అవిశ్వాసంతో ఆయన పోస్టు ఊస్ట్ గొట్టే చర్యలు ఊపందుకున్నాయి. సైన్యానికి వ్యతిరేకంగా మారిన ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి దించబోతున్నారు. ఈ క్రమంలోనే అసలు ఇమ్రాన్ ఖాన్ కు,సైన్యానికి మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వీరిద్దరికి ఎక్కడ చెడింది? పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆర్మీ పాత్ర ఎంత అనే దానిపై స్పెషల్ ఫోకస్.. […]