Homeఎంటర్టైన్మెంట్Ram Gopal Varma: ఏఐతో రాంగోపాల్ వర్మ చేసిన మాయ.. ఆ హాట్ బుట్ట బొమ్మను...

Ram Gopal Varma: ఏఐతో రాంగోపాల్ వర్మ చేసిన మాయ.. ఆ హాట్ బుట్ట బొమ్మను సాంగ్ లో ఇలా చూపించాడు

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దేశం మెచ్చిన దర్శకుడు. మొదటి చిత్రం శివ తో టాలీవుడ్ రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ఫిల్మ్ మేకింగ్ లో మూస ధోరణికి చెక్ పెట్టిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా సంచలనాలు నమోదు చేశాడు. కొన్నేళ్లుగా ఆయన తన మార్క్ వదిలేశాడు. కాంట్రవర్సీ, అడల్ట్ కంటెంట్ ని నమ్ముకుని చిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తెరకెక్కించిన చిత్రం శారీ.

ఈ చిత్రం నుండి ‘ఐ వాంట్ లవ్’ లిరికల్ విడుదల చేశాడు. ఈ సాంగ్ ని రామ్ గోపాల్ వర్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రూపొందించాడట. సాంకేతికత వచ్చాక నాకు పాటలు కంపోజ్ చేయడం చాలా సులభం అయ్యింది. ప్రస్తుత పరిస్థితులను ఏఐ టెక్నాలజీ బ్రేక్ చేస్తుందని ఆయన రాసుకొచ్చాడు. శారీ మూవీ నుండి విడుదలైన ఐ వాంట్ లవ్ సాంగ్… కుర్రకారుకు కిరాక్ పుట్టించేలా ఉంది.

ఆరాధ్య దేవి తన గ్లామర్ తో మైండ్ బ్లాక్ చేసింది. ఆరాధ్య దేవి అసలు పేరు శ్రీలక్ష్మి సతీష్. ఈమెది కేరళ రాష్ట్రం. శారీలో ఫోటో షూట్స్ చేసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసేది. సదరు ఫోటోలు చూసిన రామ్ గోపాల్ వర్మ.. ఆమె వివరాలు తెలుసుకుని హీరోయిన్ ఆఫర్ ఇచ్చాడు. పద్దతిగా కనిపించే శ్రీలక్ష్మి సతీష్ ని కాస్తా… హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ అయిన ఆరాధ్య దేవిగా మార్చేశాడు.

ఇక ఐ వాంట్ లవ్ సాంగ్ ని కీర్తన శేష్ పాడింది. డి ఎస్ ఆర్ బాలాజీ సంగీతం అందించాడు. సిరా శ్రీ సాహిత్యం అందించారు. శారీ చిత్రానికి గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా ఉన్నారు. శారీ సైకలాజికల్ థ్రిల్లర్. చీర కట్టులో ఉన్న అమ్మాయిని అతిగా ఆరాధించి, ప్రేమించిన యువకుడి కథ. ప్రేమ మితిమీరితే ఎంతటి హింసకు దారి తీస్తుందో శారీ మూవీలో తెలియజేయనున్నారు. శారీ విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది.

 

"I Want Love" Lyrical Video [Telugu] | Saaree Movie | RGV | Aaradhya Devi | RGV Den Music

Exit mobile version