వార్తల్లో నిలవడం ద్వారా తనను జనాలు మరిచిపోకుండా చూసుకుంటాడు రామ్ గోపాల్ వర్మ. అందుకే.. సెన్సేషన్ అయ్యే అంశాలను ఎంచుకొని కామెంట్లు చేస్తుంటాడు. సెన్సేషన్ అయిపోయిన విషయాలను తీసుకొని సినిమాలను తీస్తుంటాడు. తాజాగా.. పవన్ కల్యాణ్ కరోనా బారిన పడడాన్ని కూడా ఇందుకోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేశాడు.
కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన వ్యక్తిగత, భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో.. వైద్యుల సూచన మేరకు ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. అయితే.. రెండు రోజుల క్రితం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో.. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు.
ఈ విషయం తెలుసుకున్న అభిమానులతోపాటు ప్రముఖులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తున్నారు. అయితే.. రామ్ గోపాల్ వర్మ కూడా ఓ ట్వీట్ చేసి ఫ్యాన్స్ పై సెటైర్లు వేశారు. ‘‘పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆ వైరస్ ముండలను పచ్చడి చేసి చంపేయండి’’ అంటూ వర్మ కామెంట్ చేశారు.
ఇక, పవన్ గురించీ మరో ట్వీట్ చేశాడు. ‘‘ఒక కనిపించని నీచమైన పురుగు కూడా పవన్ కల్యాణ్ ను దయనీయమైన స్థితిలో పడుకోబెట్టిందంటే.. అసలు హీరో అనే వస్తువు ఈ ప్రపంచంలో ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి యువర్ హానర్’’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపై పవన్ ఫ్యాన్స్ సైతం తమదైన శైలిలో వర్మపై కామెంట్లు చేస్తున్నారు.