RGV: ఆయన స్టైల్ పద్దతి పేరు.. ఎప్పుడూ ఓ చేతిలో ఓడ్కా.. మరో చేతిలో సినిమా.. ఆయనకు ఈ ప్రపంచం తప్ప ఇంకేం అక్కర్లేదు. అప్పుడ్ప్పుడూ స్టార్ హీరోలను, రాజకీయనాయకులను అంతెందుకూ అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ను కూడా వదల్లేదు. ఎప్పుడూ ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంటాడు..వివాదాల్లో టాప్‌లో ఉంటాడు. ఆయనే రామ్‌గోపాల్ వర్మ. ఆయనకు సన్నిహితులు రాము అని పిలుస్తుంటారు.

Also Read: ఫిల్మ్ ఇండస్ట్రీకి కొత్త మార్కెట్‌ను పరిచయం చేస్తోన్న ఆర్జీవీ!
కాగా, ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నాలుగు దశాబ్దాల క్రితం రాసిన నవల తులసీదళం.ఈ నవలతో స్టార్ హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు యండమూరి. ఆయన రాసిన కొన్ని నవలలు సినిమాగానూ అవతరించాయి. ఇప్పుడు ఈ తులసి దళనానికి సీక్పెల్గా మరో కథను రాశారు యండమూరి. దాని పేరు తులసితీర్థం. అయితే, ఇప్పటి వరకు తన బ్రెయిన్ పెట్టి బయోపిక్‌లపై సినిమాలు తీస్తూ నిత్యం వివాదాల్లో ఉండే ఆర్జీవీ.. తన కెరీర్లో తొలిసారి.. యండమూరి కథతో సినిమా తెరకెక్కిచేందుకు సిద్ధమయ్యారు. భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ రేర్ కాంబినేషన్‌కు ఆజ్యం పోశారు. తులసి తీర్థం సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫుల్ గ్రాఫిక్స్‌తో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
హర్రర్ కథతో రూపొందించనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్ . కాగా, ప్రస్తుతం ఆర్జీవీ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొండా సినిమా షూటింగ్లో ఉన్న ఆర్జీవీ.. మరో రెండు సినిమాలను విడుదలకు సిద్ధం చేశాడు. లెస్బియన్ స్టోరీ నేపథ్యంలో తెరకెక్కిన డేంజరస్ ఒకటైతే.. మార్షల్ఆర్ట్స్ నేపథ్యంలో లేడీ ఓరియెంటెడ్ నేపథ్యంలో రూపొందించిన లడికీ. తెలుగులో అమ్మాయి సినిమా మరొకటి.
Also Read: రామ్ గోపాల్ వర్మ ” లడ్ కీ ” చిత్రం ట్రైలర్ విడుదల…