RGV Missing: అతను సినిమా తీశాడంతో అదో సంచలనం.. అతను ఓ ట్వట్ చేశాడంటో అదో హాట్ టాపిక్.. అతను ఒక స్పీచ్ ఇస్తే అదో సంచలనం.. ఆయనెవరో కాదు. ఎప్పుడూ పైన చెప్పిన వాటిల్లో ఫుల్ బిజీగా ఉండే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. తాజాగా, మరో వివాదానికి తెరలేపారు ఆర్జీవీ. ఇప్పటికే ప్రవర్ స్టార్ సినిమాతో పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైన ఆర్జీవీ.. ఇప్పుడు మరోసారి ఆ సినిమాకు సీక్వెల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఆర్దీవీ మిస్సింగ్ అంటూ ట్రైలర్‌ను వదిలాడు.
https://youtu.be/h8Dae9ovgfk
ఈ క్రమంలోనే ఈ ట్రైలర్ లింక్‌ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. పవర్ స్టార్.. ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదలకు సిద్ధమైంది.. ఆర్జీవీ మిస్ అయ్యాడు. మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతని కొడుకుపైనే అనుమానంగా ఉంది.. అని చెప్పుకొచ్చాడు. ఇందులో పవన్, చిరు పేర్లను తప్పుగా ట్యాగ్ చేస్తే.. చంద్రబాబు, లోకేశ్ పేర్లను మాత్రం కరెక్టుగా ట్యాగ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ సినిమాకు అధిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కెవి ఛటర్జీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ సినిమాతో వర్మ ఎలాంటి మార్కును క్రియేట్ చేస్తాడో చూడాలి.
ఆర్జీవీ తన సినిమా ప్రపంచంలో మునిగిపోయి ఉంటాడన్న విషయం తెలిసిందే. ఇటీవల అమ్మాయి ట్రైలర్ వదిలి అందరి దృష్టిని ఆకర్షించారు. తొలి ఇండియన్ మార్షల్ఆర్ట్స్ సినిమాగా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కాగా, మరోవైపు డేంజర్స్ సిసినా కూడా తీసి లెస్బియన్స్ ప్రేమను అందులో చూపించేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు మరోసారి రాజకీయాలను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.