RGV: సాహిత్య మధురిమలను అందరికీ అందుబాటులో ఉంచి.. తాను మాత్రం తిరిగి రాని అనంతలోకాలకు వెళ్లారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఇటీవలే ఆయన మరణవార్త సినీ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యేలా చేసింది. అభిమానులతో పాటు.. పలువురు సినీ ప్రముఖులు ఆయన లేరనే వార్త తట్టుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. ఇలా సిరివెన్నెలకు ఉన్న అశేష అభిమానుల్లో సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా ఒకరు.
బాధ, సంతోషం లాంటి ఫీలింగ్స్‌ను పెద్దగా పట్టించుకోని వర్మ.. సిరివెన్నెల విషయంలో అతని భావోద్వేగాన్ని దాచుకోలేకపోయారు. సిరివెన్నెల మరణవార్త విన్న వెంటనే.. ఆయన గురించి వరుసగా ట్వీట్లు చేస్తూ.. తన వేదనను వెలిబుచ్చారు. తాజాగా, ఎ కిస్టు సిరివెన్నెల పేరుతో.. ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేశారు ఆర్జీవి.
5 నిమిషాలున్న ఈ వీడియోలో.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి వర్మ ఏమన్నారో చుద్దాం.. సిరివెన్నెల అంత అద్భుతంగా పాటలు రాయడానికి ఆయన ఆలోచన, సమాజంపై అతనికి ఉన్న అవగాహనే కారణమని ఈ వీడియోలో వర్మ చెప్పారు. సిరివెన్నెల రాసిన పాటల్లో తనకు అత్యంత ఇష్టమైన పాట.. ‘ఎప్పుడూ ఓప్పు కోవద్దు రా.. ఓటమి’ అని తెలిపారు. తనదైన స్టైల్లో పాటను కూడా పాడి.. సిరివెన్నెలకు ట్రిబ్యూట్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు.. ఆర్జీవికి సిరివెన్నెలపై ఉన్న ప్రేమ ఇదేనంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.