అరియానా ఘాటు భంగిమలతో ‘ఆర్జీవీ’ పైత్యం !

‘ఆర్జీవీ’ అనే వింత జీవి ఏమి చేసినా వివాదమే. అయితే, ఇన్నాళ్లు తన పైత్యాన్ని సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం చేసిన ఆర్జీవీ, ఇప్పుడు ఇంటర్వ్యూలకు కూడా ఆ చీప్ ట్రిక్స్ ను తీసుకొచ్చాడు. తెలుగు సినిమా ఇంటర్వ్యూలకు కొత్త టచ్ ఇచ్చే క్రమంలో.. తనకు మాత్రమే సాధ్యమయే బూతు మయంతో నిండిపోయిన బోల్డ్ షాట్స్ ను పెట్టి, ఒక టీజర్ లాంటి ప్రోమోను వదిలాడు. ఆర్జీవీ – ఆరియానాల మధ్య జరిగిన బోల్డ్ ఇంటర్వ్యూ […]

Written By: admin, Updated On : June 18, 2021 12:00 pm
Follow us on

‘ఆర్జీవీ’ అనే వింత జీవి ఏమి చేసినా వివాదమే. అయితే, ఇన్నాళ్లు తన పైత్యాన్ని సినిమా ప్రమోషన్స్ కి మాత్రమే పరిమితం చేసిన ఆర్జీవీ, ఇప్పుడు ఇంటర్వ్యూలకు కూడా ఆ చీప్ ట్రిక్స్ ను తీసుకొచ్చాడు. తెలుగు సినిమా ఇంటర్వ్యూలకు కొత్త టచ్ ఇచ్చే క్రమంలో.. తనకు మాత్రమే సాధ్యమయే బూతు మయంతో నిండిపోయిన బోల్డ్ షాట్స్ ను పెట్టి, ఒక టీజర్ లాంటి ప్రోమోను వదిలాడు. ఆర్జీవీ – ఆరియానాల మధ్య జరిగిన బోల్డ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలియదు గానీ,

అరియానాలోని అందాలను ఆర్జీవీ కెమెరా చాల క్లారిటీగా తెరకెక్కించింది. ముఖ్యంగా అరియానాకు జిమ్ డ్రెస్ వేసి, ఆమెను రకరకాల భంగిమల్లో పెట్టి కెమరాను కింద నుండి , కాసేపు పై నుండి మొత్తానికి కుర్రాళ్లను ఆకట్టుకోవడానికి ఆర్జీవీ చేయాల్సింది అంతా చేశాడు. గత కొన్ని రోజులుగా ఆసక్తిని పెంచుతున్న ఈ ఇంటర్వ్యూ స్టిల్స్.. తాజాగా ప్రోమోతో కూడా హీట్ పెంచింది.

అయితే ఈ ప్రోమోలో అరియానా భంగిమల పై పెట్టిన ఫోకస్, కంటెంట్ మీద పెట్టలేదు. దీనికితోడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఆ సౌండ్ కు తగ్గట్టు ఆర్జీవీ కసి చూపులు, మధ్యలో కొన్ని కొన్ని సార్లు అరియానా సిగ్గు.. మొత్తమ్మీద ఈ ఇంటర్వ్యూను ఆర్జీవీ సినిమా రేంజ్ లో పబ్లిసిటీ చేస్తున్నాడు. మరి దీన్ని చూడటానికి కూడా టికెట్ రేటు పెట్టి, క్యాష్ చేసుకునే ఆలోచన ఆర్జీవీ ఉందేమో.

అయినా, అరియానా కెరీర్ కు ఇది ఎంతవరకు ఉపయోగ పడుతుందో తెలియదు గాని, ఆమెకు మాత్రం ఫుల్ పబ్లిసిటీ దక్కుతుంది. అన్నట్టు ప్రోమోలో కొన్ని సార్లు ఆరియానా చెవులు మూసుకుంది. మరి ఆయా చోట్ల ఆర్జీవీ తనదైన బూతు డైలాగులు వదిలి ఉండొచ్చు. ఒక్కటి మాత్రం చాలా స్పష్టంగా అర్ధమవుతుంది. ఈ ఇంటర్వ్యూలో ద్వందార్ధాలు, ఆర్జీవీ కసి చూపులు, అరియనా అందాల విందు పక్కాగా ఉంటాయి.