Revolver Rita Review: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కీర్తి సురేష్ ‘మహానటి’ సినిమాతో గొప్ప విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంది. ఇక అప్పటినుంచి చాలా సినిమాలను చేస్తూ వస్తున్న కీర్తి సురేష్ అటు హీరోయిన్ గా చేస్తూనే లేడీ ఓరియంటెడ్ సినిమాల వైపు కూడా ఎక్కువగా దృష్టి సారిస్తోంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు ‘రివాల్వర్ రీటా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అసలు సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకుందాం పదండి…
కథ
రీటా అనే అమ్మాయి తన తల్లి, అక్క, చెల్లి తో కలిసి పాండిచ్చేరిలో నివాసం ఉంటుంది. ఇక బతుకుదెరువు కోసం రీటా అక్కడే ఒక రెస్టారెంట్ లో పనిచేస్తోంది… ఒకరోజు ఆ ఏరియా లో రౌడీ అయిన డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) ను కొంతమంది రౌడీలు పొడిస్తారు… పాండ్యన్ ఆ రౌడీల నుంచి తప్పించుకొని వచ్చి రీటా వాళ్ల ఇంట్లో చనిపోతాడు… దాంతో రీటా ఫ్యామిలీకి ఏం చేయాలో అర్థం కాదు…
సరిగ్గా ఇదే సమయంలో డ్రాకులా పాండ్యన్ కొడుకు అయిన బాబీ (సునీల్) తన తండ్రి కోసం వెతుకుతుంటాడు. ఇక రీటా వాళ్ళకు పాండ్యన్ శవాన్ని ఏం చేయాలో అర్థం కాదు. ఇక ఇదే సమయంలో పోలీసుల దృష్టి రీటా వాళ్ల ఇంటి మీద పడుతోంది… ఫైనల్ గా రీటా ఆ శవాన్ని ఏం చేసింది… పాండ్యన్ కొడుకు బాబీ కి రీటా కి సంబంధం ఏంటి..? అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ…
డైరెక్టర్ జే కే చంద్రు ఈ సినిమాని థ్రిల్లర్ గా మలచాలనే ప్రయత్నం చేశాడు. నిజానికి ఒక మర్డర్ మిస్టరీని సస్పెన్సియస్ గా ప్రేక్షకులకు చూపించాలి అంటే అది పెద్ద టాస్క్…దానిని ఎంచుకునే ముందే స్క్రీన్ ప్లే ను చాలా పకడ్బందీగా రాసుకోవాలి. కథ రొటీన్ గా ఉన్నప్పటికి స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలకైతే స్క్రీన్ ప్లే నే ఆయువు పట్టని చెప్పాలి… కానీ ఈ సినిమాలో అది మైనస్ అయింది. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్న సీన్స్ కనిపించవు. నిజానికి ఇలాంటి సినిమాల్లో సస్పెన్స్ తో ప్రేక్షకుడిని కట్టిపడేసినప్పుడే వాడు ఒకటికి రెండుసార్లు ఆ సినిమాని చూడడానికి ఇష్టపడతాడు. అంతే తప్ప స్క్రీన్ ప్లే తో ప్రేక్షకుల్ని రంజింపచేయాలి అనుకోవడం కరెక్ట్ కాదు…రివాల్వర్ రీటా క్యారెక్టర్ ను కూడా బాగా డిజైన్ చేసినప్పటికి ఎవరో చేసిన హత్యకి వాళ్ళ కుటుంబం సఫర్ అయ్యే విధానంలో రీటా ఏం చేసింది అనేది క్లియర్ కట్ గా చూపించలేకపోయాడు.
నిజానికి తన క్యారెక్టర్జేషన్లో వేరియేషన్స్ ని చూపిస్తూ తన ఫ్యామిలీకి తను ఎలా అండగా నిలబడింది. ఆ ప్రాబ్లం నుంచి తన ఫ్యామిలీని ఎలా సేవ్ చేసుకుంది అనేది చాలా బలంగా చూపించాలి. అలాంటప్పుడే క్యారెక్టర్ యొక్క పొటెన్షియాలిటీ బయటపడుతోంది. అలాగే మిగతా వాళ్ళు చేయలేని సిచువేషన్ ఆమె ఎదుర్కొంది. కాబట్టి ఆమె ధైర్య సాహసాలు కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి.
ఇక ఈ సినిమాలో మాత్రం రీటా క్యారెక్టర్ కి ఉండే ప్రాముఖ్యత లేకపోగా పక్కనున్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తను కూడా అలాగే రియాక్ట్ అవుతుంది. దానివల్ల ఆ క్యారెక్టర్ యొక్క వాల్యూ పడిపోతుంది… ఏవో కొన్ని థ్రిల్లర్ సినిమాలను చూసి స్టోరీ రాసుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప దీనిని పకడ్బందీగా మలచాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాని చేయలేదేమో అనేది ప్రతి నిమిషం మనకు అనిపిస్తూనే ఉంటుంది. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు.
ట్రీట్మెంట్లో ఏవైతే ఎలిమెంట్స్ ని మనం పర్ఫెక్ట్ గా రాసుకుంటామో వాటిని స్క్రీన్ ప్లే లో కూడా ప్రేక్షకుడికి ఆంగ్జేటి వచ్చేలా డెలివరీ చేసినప్పుడు మాత్రమే అవి సక్సెస్ఫుల్గా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయగలుగుతాయి. లేకపోతే మాత్రం రిజల్ట్ తేడా కొడుతోంది. ఇక కీర్తి సురేష్ ఈ క్యారెక్టర్ లో బాగా నటించినప్పటికి ఆ పాత్రకి ఉన్న వేరియేషన్స్ ని డైరెక్టర్ సరిగ్గా రాసుకోకపోవడం వల్ల ఆమె తన పాత్ర పరిధి మేరకు యాక్టింగ్ చేయాల్సి వచ్చింది…
రాధిక శరత్ కుమార్ సైతం తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. జాన్ విజయ్ కొంత వరకు కామెడీని ట్రై చేసినప్పటికి ఆయన ప్రతి సినిమాలో చేసే సీన్స్ ఈ సినిమాలో కూడా చేసినట్టుగా అనిపించింది…సునీల్ క్యారెక్టర్ కూడా పెద్ద గొప్పగా ఏమీ లేదు ఏదో వచ్చింది అంటే వచ్చింది. పోయింది అంటే పోయింది అన్న రేంజ్ లోనే ఉంది…మ్యూజిక్ కూడా అంత పెద్ద ఎఫెక్టివ్ గా అనిపించలేదు. థ్రిల్లింగ్ గొలిపే అంశాలను ఇంకా కొంచెం ఎఫెక్టివ్ గా రాసి ఉంటే ఆ సీన్ తాలూకు ఎమోషన్ మారిపోయి ఉండేది… విజువల్స్ కొంతవరకు పర్లేదు అనిపించినప్పటికి కొన్ని డల్ సీన్లలో లైటింగ్ బాగా బ్రైట్ గా పెట్టడం వల్ల అది సాడ్ సీనా లేకపోతే హ్యాపీ సీనా అనే వెరియేషన్ లైటింగ్ సరిగ్గా చూపించలేకపోయారు… ప్రొడక్షన్ వాల్యూస్ ఒకే అనిపించాయి…
బాగున్నవి ఇవే…
ఫస్ట్ 15 నిమిషాలు…
ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్…
బాగోలేనివి ఇవే…
స్క్రీన్ ప్లే
మ్యూజిక్
ట్విస్టు లు
రేటింగ్ : 2/5
థ్రిల్లర్ సినిమా అన్నారు. అసలు థ్రిల్లింగ్ గా అనిపించే సీన్ ఒక్కటి కూడా లేదు…
