Review Writers: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి వరుసగా సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి చాలామంది రివ్యూలను ఇస్తూ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను వాడుకుంటున్నారు. ఇక గత కొన్ని రోజుల నుంచి రివ్యూల వల్లే సినిమాలు సరిగ్గా ఆడడం లేదంటూ కొంతమంది నిర్మాతలు తమ సినిమాకు రివ్యూలు ఇచ్చే వాళ్ళ కోసం కోర్టుకు వెళ్లారు. ఇక అక్కడ కోర్టు సైతం ప్రజాస్వామ్య దేశంలో ఎవరి భావాన్ని వాళ్ళు వ్యక్తీకరించుకోవడానికి వాళ్లకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. వాళ్లను కాదని చెప్పడం వల్ల మనం కూడా భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించినట్టు అవుతుంది. కాబట్టి రివ్యూస్ చెప్పే వాళ్లకు ఇలాంటి ఆంక్షలు లేవు అని కోర్టు చెప్పడంతో అందరూ సైలెంట్ గా ఉండిపోయారు. ప్రస్తుతం తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్ ఇదే విషయం మీద కోర్టును ఆశ్రయించడంతో అక్కడ కోర్టు సైతం అతనికి మొట్టికాయలు వేస్తూ భావ ప్రకటన స్వేచ్ఛను తొక్కి పారేయడం ఎవరి వల్ల కాదు అంటూ వివరణ అయితే ఇచ్చిందట. మరి ఏది ఏమైనా కూడా మంచి సినిమాలు చేస్తే ఆ సినిమా బాగుంటే రివ్యూ రైటర్లు సైతం ఆ సినిమా గురించి చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. సినిమా బాగోలేక పోతే బాలేదు అని చెప్పడం వల్ల ప్రేక్షకులకు సినిమాలు చూడడానికి ఎక్కువగా ఆసక్తి అయితే చూపించరు.
Also Read: నిన్న సఫారీలు, నేడు కరేబియన్లు.. సుదీర్ఘ ఫార్మాట్ లో కంగారుల పని ఖతమేనా?
అయితే రివ్యూ రైటర్లు రివ్యూ ఇవ్వడం వల్ల సినిమా చూడాలనుకునే వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. సినిమా చూద్దామా? వద్దా అనే డైలమాలో ఉన్న వారికి మాత్రం రివ్యూ రైటర్లు చెప్పే రివ్యూ ని బేస్ చేసుకొని వాళ్ళు సినిమాకు వెళ్లాలా లేదా అనే ఆలోచనలో పడుతున్నారు.
నిజానికి స్టార్ హీరో సినిమాలను చాలామంది ప్రేక్షకులు థియేటర్ లోనే చూడడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి స్టార్ హీరోల సినిమాలకి టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకుడు ఒక్కసారైనా వాళ్ళ సినిమాలను చూస్తాడు. కాబట్టి వాళ్ల సినిమాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక చిన్న సినిమాలకే కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ నిర్మాతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా సినిమా రిలీజ్ అయిన 20 రోజుల లోపే ఓటిటి లోకి రావాల్సి ఉంది. ఇక సినిమా రిలీజ్ రోజే ఆ సినిమాకు సంబంధించిన రివ్యూ ఇవ్వడం వల్ల మేము నష్టపోతున్నామని వాళ్ళు చెబుతుండడం విశేషం…మరి ఇలాంటి రీజన్లు చెప్పడం కంటే మంచి సినిమాను చేసి ప్రేక్షకుల ముందు ఉంచుతే మంచిది కదా అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.