https://oktelugu.com/

Rajamanaar From Salar : ‘రాజమన్నార్’గా ప్రభాస్.. అధికారిక ప్రకటన !

Rajamanaar From Salar : హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రానున్న సినిమా ‘సలార్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సలార్ నుండి ‘రాజమన్నార్’ రాబోతున్నాడు అంటూ ఆ పోస్టర్ లో హైలైట్ చేశారు. ‘రాజమన్నార్'() అంటే సినిమాలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ క్యారెక్టరా ? లేక […]

Written By:
  • admin
  • , Updated On : August 22, 2021 / 11:54 AM IST
    Follow us on


    Rajamanaar From Salar : హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రానున్న సినిమా ‘సలార్’. కాగా తాజాగా ఈ సినిమా నుండి ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయింది. రేపు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు సలార్ నుండి ‘రాజమన్నార్’ రాబోతున్నాడు అంటూ ఆ పోస్టర్ లో హైలైట్ చేశారు. ‘రాజమన్నార్'() అంటే సినిమాలో ప్రభాస్ ఓల్డ్ గెటప్ క్యారెక్టరా ? లేక సినిమాలో మరో ప్రధాన పాత్రనా అనేది రేపు తెలియనుంది.

    మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి తర్వాత ప్రకటన ఎప్పుడొస్తుందా? అంటూ ఆశగా చూసిన అభిమానుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. రేపు ప్రేక్షకుల ముందుకు ‘రాజమన్నార్’ అనే సరికొత్త పాత్రను తీసుకురానున్నట్లు హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ అధికారికంగా ప్రకటించింది కాబట్టి.. ఈ అప్ డేట్ సినిమాకి సంబందించి కీలకమైనది అయి ఉండాలి.

    ఇక ఈ క్రేజీ యాక్షన్ ఫిల్మ్ పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను క్యాష్ చేసుకోవాలని సలార్ నిర్మాతలు కూడా కేజీఎఫ్ లానే స‌లార్ ని కూడా రెండు భాగాలుగా విడుద‌ల చేయాలనే ఆలోచ‌నలో ఉన్నారని ఇప్పటికే వార్తలు వచ్చిన నేపథ్యంలో.. ఈ అంశం పై కూడా హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ క్లారిటీ ఇస్తే బాగుంటుంది.

    ఒకవేళ సలార్ ను కూడా రెండు పార్ట్స్ గా తీసుకువస్తే బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి రాజమౌళి తర్వాత తన సినిమాకి బిజినెస్‌ ప‌రంగా భారీ లాభాల‌ను ఆర్జించ‌డంలో ప్ర‌శాంత్ నీల్ కూడా ఆరితేరిపోయాడు. కేజీఎఫ్ విషయంలోనే ప్రశాంత్ నీల్ బాగా కలెక్షన్స్ ను పిండుకున్నాడు.

    ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తోంది.