Bigg Boss 6 Telugu- Revanth vs Srihan: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన రోజు నుండి నేటి వరుకు ఒక గ్రూప్ గా స్నేహితులుగా కొనసాగుతున్న ఇంటి సభ్యులు ఎవరైనా ఉన్నారా అంటే అది రేవంత్ – శ్రీహాన్ – శ్రీ సత్య అని చెప్పొచ్చు..ఒక పక్క స్ట్రాటజీ తో వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఎలాంటి గొడవలు లేకుండా ఇన్ని రోజులు నెట్టుకొచ్చారు..కానీ ఈ వారం బిగ్ బాస్ ఈ గ్యాంగ్ ని డివైడ్ చేసాడు..శ్రీహాన్ స్నేక్ టీం లో మరియు శ్రీ సత్య ,రేవంత్ ఉన్నారు.

వీళ్లిద్దరు ఒకే టీం లో ఉన్నా కూడా ‘నాగమణి’ టాస్కు అప్పుడు శ్రీ సత్య రేవంత్ తో ఫిజికల్ అవ్వొద్దు అని అరవడం తో రేవంత్ అలిగి గేమ్ ఆడడం మానేస్తాడు..అప్పుడు వీళ్లిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది..చాలా సేపటి వరుకు తగువులు వేసుకుంటారు..అప్పటి నుండి చిన్నగా శ్రీహన్ మరియు రేవంత్ కి మధ్య కూడా చిన్నగా చిన్నగా మాటమాట పెరగడం ప్రారంభం అవుతుంది.
మొన్న రాత్రి పడుకునే సమయం లో రేవంత్ సరదాగా శ్రీహాన్ మీద కామెంట్ చేస్తూ ‘మనం పిలిస్తే వాడు రాదు రా..అదే శ్రీ సత్య పిలించింది అనుకో ఆ దుప్పటి లాగుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు..నిది నిజమేనా స్నేహం కాదని నాకు 10 వ వారం లో అర్థం అయ్యింది’ అంటూ కామెంట్ చేస్తాడు..ఆ పక్క రోజు శ్రీహాన్ ‘ఏదైనా అనేముందు జాగ్రత్తగా చూసుకొని మాట్లాడరా..నిన్న రాత్రి కూడా శ్రీ సత్య పిలిస్తే దుప్పటి పట్టుకొని వెళ్ళిపోతావ్ అని మాట్లాడావ్..ఇనాయ అంటే ఎదో కోపం లో అనేసింది..నువ్వు కూడా అలానే అంటే నీకు ఆ పిల్లకి తేడా ఏమి ఉంది’ అని అంటాడు.

అప్పుడు శ్రీహాన్ ‘నేను అసలు దుప్పటి అనే పదమే తియ్యలేదురా అని అంటాడు..నువ్వు ఆ పదం తీసావు రా..లేకపోతే నీ మీద అబాండాలు వేస్తె నాకు ఏమొస్తది చెప్పు..ఆ పిల్ల ఇనాయ అనింది అంటే మనసులో పెట్టుకొని మాట్లాడింది అని అనుకోవచ్చు ..మన ముగ్గురం మంచి స్నేహితులం అయ్యుండి కూడా మా ఇద్దరి గురించి ఆలా కామెంట్ చేస్తే ఎలా చెప్పు’ అని శ్రీహన్ రేవంత్ కి క్లాస్ పీకుతాడు.