Bigg Boss 6 Telugu- Revanth: గడిచిన సీసన్స్ తో పోలిస్తే ఈ సీసన్ పాల్గొన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో అత్యధిక పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ కేవలం ఒకరిద్దరు మాత్రమే..ఆ ఒకరిద్దరిలో ఒకడే రేవంత్..మొదటి రోజు నుండి నేటి వరుకు గేమ్ పరంగా కానీ,ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ అందరికంటే నెంబర్ 1 స్థానం లో కొనసాగుతున్న వ్యక్తి రేవంత్ మాత్రమే..అయితే ఇతగాడితో వచ్చిన సమస్య ఏమిటంటే భయంకరమైన కోపస్తుడు..అతని మాట తీరు కూడా కొడుతున్నట్టే ఉంటుంది..అందుకే ప్రతి వారం అతనిని ఇంటి సభ్యులు నామినేట్ చేస్తూ వచ్చేవారు..కానీ ఆడియన్స్ లో మాత్రం అతగాడికి ఉన్న క్రేజ్ వేరు.

నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా రేవంత్ కి వచ్చే ఓట్లలో మిగిలిన ఇంటి సబ్యులకు సగం కూడా రావనే చెప్పాలి..రేవంత్ విషయం లో మరో పెద్ద మైనస్ ఏమిటి అంటే ఇతను ఆట ఆడుతున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ముందు వెనుక కూడా చూసుకోడు..దాని వల్ల ఇంటి సబ్యులకు అనవసరం గా శత్రువు అయిపోతున్నాడు.
ఈరోజు జరిగిన టాస్కులో అయితే తన నోటిని అదుపులో పెట్టుకోవడం లో పూర్తిగా విఫలం అయ్యాడు..’తోసి పారదొబ్బంది’ అంటూ అతను వాడిన పదం కి ఇంటి సభ్యులు చాలా తీవ్రంగా విమర్శించారు..అంతే కాకుండా బిగ్ బాస్ రూల్స్ ని అయితే ఈరోజు రేవంత్ పూర్తిగా అతిక్రమించాడు..మైక్ ని ధరించకపోవడం తో బిగ్ బాస్ చేత వార్నింగ్ రప్పించుకుంటాడు..ఇదే విషయం లో శ్రీ సత్య తో గొడవ పడ్డాడు..అంతే కాకుండా తన నోటి బిరుసుతో మెరీనా కి కూడా కోపం తెప్పించాడు.

అంతే కాకుండా అర్జున్ కళ్యాణ్ ని అడ్డు తప్పించడానికి రెండు మోకాళ్ళతో అర్జున్ కాళ్ళని తొక్కే ప్రయత్నం చేసాడు..వాసంతి ని కూడా ఊపులో చూసుకోకుండా కడుపులో గుడేస్తాడు..ఇలా ఆయన ఫిజికల్ గా కూడా అదుపు తప్పేసాడు..ఈ వీకెండ్ దీనికి నాగార్జున గారి దగ్గర నుండి రేవంత్ కి కోటింగ్ తప్పేలా లేదు..ఆట శ్రద్దగా ఆడడం మంచిదే..కానీ రూల్స్ ని పాటిస్తూ ఆడడం చాలా ముఖ్యం..అది రేవంత్ ఈ వారం ఫాలో అవ్వడం పూర్తిగా విఫలం అయ్యాడు.