Sri Satya- Arjun Kalyan:ఈ వారం బిగ్ బాస్ హౌస్ గత వారం లాగ కూల్ గా సాగలేదు..కంటెస్టెంట్స్ బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కుని నిర్లక్ష్యం చెయ్యడం తో కెప్టెన్సీ టాస్కు రద్దు అయ్యింది..ఇక తర్వాత బిగ్ బాస్ ఇంటి సబ్యులకు చాలా కఠినతరమైన టాస్కులను ఇచ్చాడు..ఆ తర్వాత ఇక నుండి ప్రేక్షకులను నిరాశపర్చమని బిగ్ బాస్ అందరి చేత ప్రమాణస్వీకారం చేయిస్తాడు..ఇక తర్వాత ఇచ్చిన టాస్కులో ప్రతి ఒక్క కంటెస్టెంట్ టాస్కుని చాలా సీరియస్ గా తీసుకొని ఆడాడు..మధ్యలో చాలా గొడవలు కూడా జరిగాయి..శ్రీహాన్ తన పుట్టినరోజు ని కూడా మర్చిపొయ్యి ఇంటి సభ్యులతో గొడవపడి ఆడాడు.

ఇక అర్జున్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ వారం ఆయన తనలోని కొంత కోణాన్ని ఆవిష్కరించాడు..అర్జున్ లో వచ్చిన ఆ మార్పుని చూసి ఇంటి సభ్యులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు..శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ తన గేమ్ ని పాడుచేసుకుంటున్నాడు అనే పేరు నుండి ఈ వారం ఆయన పూర్తిగా బయటపడినట్టే చెప్పొచ్చు.
ఇక ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత రేపటి ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో టెలికాస్ట్ ..ఆ ప్రోమో ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..ప్రతి వారం లాగానే ఈ వారం కూడా వరస్ట్ కంటెస్టెంట్ నామినేషన్స్ జరిగింది..ఈ నామినేషన్స్ లో అర్జున్ కళ్యాణ్ తన వోటుని శ్రీ సత్య కి వేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేసాడు..మొదటి నుండి శ్రీ సత్య చుట్టూ తిరుగుతూ,శ్రీ సత్య కి ఫుల్లు సపోర్టుగా ఉంటూ..అసలు బిగ్ బాస్ కి వచ్చింది శ్రీ సత్య కోసమే అనేంతలా ప్రవర్తించిన అర్జున్ కళ్యాణ్,ఇప్పుడు ఆమె నుండి బయటపడి తన గేమ్ ని సంపూర్ణంగా ఆడదానికి ప్రయత్నిస్తున్నాడు అనే విషయం మాత్రం అందరికి అర్థం అయ్యింది.

ఈ వారం ఈయనని అక్కినేని నాగార్జున మెచ్చుకునే అవకాశం కూడా ఉంది..అంతే హౌస్ లో మొదటి రోజు నుండి నెంబర్ 1 కంటెండర్ గా కొనసాగుతున్న రేవంత్ కి నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ ఇస్తున్నాడు అర్జున్ కళ్యాణ్..ఇది నిజంగా ఎవ్వరు ఊహించనిది అనే చెప్పాలి…నిన్న మొన్నటి వరుకు అర్జున్ ఆట తీరుని చూసిన ట్రోల్ల్స్ చేసిన నెటిజెన్స్ కూడా ఇప్పుడు మెచ్చుకునే స్థాయిలో ఆయన ఆడుతున్నాడు..ఇదే ఫ్లో ని ఆయన చివరి వరుకు కొనసాగిస్తాడో లేదో చూడాలి.