https://oktelugu.com/

Rahul Sipligunj- Punarnavi: లండన్ నుండి రాగానే మింగిల్ అయిన బిగ్ బాస్ లవర్స్… వైరల్ గా రాహుల్, పునర్నవి రొమాంటిక్ వీడియో!

చాలా ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. ఈ వీడియోను రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో లో ముందు పునర్నవికి ఫ్లవర్ బొకే ఇచ్చాడు. వెల్కమ్ పునర్నవి గారు అంటూ పలకరించాడు రాహుల్.

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2023 / 04:07 PM IST

    Rahul Sipligunj- Punarnavi

    Follow us on

    Rahul Sipligunj- Punarnavi: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నటి పునర్నవి చాలా రోజుల తర్వాత కలిశారు. బిగ్ బాస్ 3 లో వీళ్ళ మధ్య లవ్ ట్రాక్ ఓ రేంజ్ లో హిట్ అయింది. బిగ్ బాస్ తర్వాత పునర్నవి సినిమాలకు గ్యాప్ ఇచ్చి లండన్ వెళ్ళిపోయింది. ఇక రాహుల్ బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీ బాగా వాడుకున్నాడు. వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ రేంజ్ పెంచేసాడు. తన టాలెంట్ తో ఆస్కార్ వేదిక వరకు వెళ్ళిపోయాడు రాహుల్ సిప్లిగంజ్.

    అయితే చాలా ఏళ్ల తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ కలిశారు. ఈ వీడియోను రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో లో ముందు పునర్నవికి ఫ్లవర్ బొకే ఇచ్చాడు. వెల్కమ్ పునర్నవి గారు అంటూ పలకరించాడు రాహుల్. అయ్యో థాంక్యూ రాహుల్ గారు అంటూ సరదాగా ఆట పట్టించింది పునర్నవి. వాట్సాప్ పునర్నవి .. చాలా రోజుల తర్వాత దర్శనం ఇచ్చావ్ అని రాహుల్ అడిగాడు.

    నీతో సాంగ్ లాంచ్ చేద్దాం అని ” నీ అయ్యా నా మామ” పాట అని రాహుల్ అన్నాడు. దీంతో తిడుతున్నావారా నన్ను అంటూ తెగ నవ్వుకుంది పునర్నవి. లేదురా .. అని రాహుల్ అంటే మరి మా నాన్నని తిడుతున్నావా అంటూ జోక్ చేసింది. ఇక మిగిలిన లిరిక్స్ ఏంటి అని అడిగి సాంగ్ పాడించుకుని వినేసింది. తర్వాత రాహుల్ గురించి కాసేపు మాట్లాడి తన చేతుల మీదుగా సాంగ్ లాంచ్ చేసింది పునర్నవి.

    చాలా రోజులుగా ఈ సాంగ్ గురించి రాహుల్ చెప్తున్నాడు. లాంచింగ్ ఇలా పున్నూ తో చేయిస్తాడని ఎవరూ ఊహించలేదు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలా హ్యాపీ గా ఉంది మీరు మళ్ళీ కలిసి కనిపించినందుకు అంటూ కామెంట్లు పెడుతున్నారు. బిగ్ బాస్ ఎవర్ గ్రీన్ జోడి, క్యూట్ మీట్, అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం పునర్నవి లండన్ లో చదువుకుంటుంది.