Retro : వరుస ఫ్లాప్స్ లో ఉన్న సౌత్ సూపర్ స్టార్స్ లో ఒకరు సూర్య(Suriya Sivakumar). తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీస్ లోనూ రజినీకాంత్ తర్వాత అంతటి మార్కెట్ ని సొంతం చేసుకున్న మొదటి తమిళ హీరో ఈయన. సరైన హిట్ తగిలితే అన్ని ఇండస్ట్రీస్ షేక్ అవుతాయి, కానీ ఆ హిట్ ఈయన చూసి దాదాపుగా పదేళ్లు దాటింది. గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘కంగువ’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టింది. ఈ సినిమా హిట్ అయ్యుంటే సూర్య కం బ్యాక్ మామూలు రేంజ్ లో ఉండేది కాదు. పాపం ఆయన బ్యాడ్ లక్ అనుకోవాలి. ఇకపోతే నిన్న ఈయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రెట్రో'(Retro Movie) గ్రాండ్ గా విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకి ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది.
Also Read: హిట్ 3 ఓటీటీలో.. ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చంటే?
అయినప్పటికీ విడుదలకు ముందు నుండే ఈ సినిమాకు భారీ క్రేజ్ ఉండడం వల్ల ఓపెనింగ్స్ అన్ని ప్రాంతాల్లో అదిరిపోయాయి. ముఖ్యంగా తమిళనాడు లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి అట. ‘కంగువ’ చిత్రానికి కేవలం 12 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ‘కంగువ’ చిత్రానికి తమిళనాడు లో కాస్త తక్కువ వచ్చినా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూస్తే ‘రెట్రో’ కంటే ‘కంగువ’ నే ఎక్కువ గ్రాస్ సాధించింది. కారణం కంగువ చిత్రానికి టాలీవుడ్ ఓపెనింగ్ కూడా బాగా కలిసొచ్చింది. కానీ ‘రెట్రో’ కి టాలీవుడ్ లో అనుకున్నంత ఓపెనింగ్ రాలేదు. ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం 2 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.
ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో కూడా ఈ సినిమాకు కంగువ కంటే తక్కువ వసూళ్లే వచ్చాయి. ఓవరాల్ గా చూస్తే కంగువ కి మొదటి రోజు దాదాపుగా 40 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, రెట్రో చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది సూర్య కి మంచి ఓపెనింగ్ కానీ, బ్రేక్ ఈవెన్ కి సరిపడా ఓపెనింగ్ కాదు అనే చెప్పాలి. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 82 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావాలి, అంటే దాదాపుగా 200 కోట్ల రూపాయిలు అన్నమాట. ఆ రేంజ్ వసూళ్లు ఈ చిత్రానికి రావడం దాదాపుగా అసాధ్యమే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్ళు మాత్రమే వచ్చే అవకాశం ఉందట. అంటే సూర్య కెరీర్ లో ఈ చిత్రం మరో డిజాస్టర్ గా నిలవబోతుందా?, కనీసం యావరేజ్ అయినా అవుతుందో లేదో చూడాలి.
Also Read : ‘రెట్రో’ కి బ్లాక్ బస్టర్ ఓపెనింగ్..మొదటి రోజు ఎంత వసూళ్లు వస్తాయంటే!