https://oktelugu.com/

Republic Twitter Review: ‘రిపబ్లిక్’ ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే?

Republic Twitter Review: ‘ప్రీరిలీజ్ వేడుక’తోనే కావాల్సినంత కాంట్రవర్సీని, పాపులారిటీని తెచ్చుకున్న మూవీ ‘రిపబ్లిక్’. యాక్సిడెంట్ జరిగి హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి బెడ్ పై పడి ఉండగా.. ఆయన మేనమామ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేదికపై చేసిన విమర్శలు ఏపీ సర్కార్ ను, సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 1, 2021 / 08:58 AM IST
    Follow us on

    Republic Twitter Review: ‘ప్రీరిలీజ్ వేడుక’తోనే కావాల్సినంత కాంట్రవర్సీని, పాపులారిటీని తెచ్చుకున్న మూవీ ‘రిపబ్లిక్’. యాక్సిడెంట్ జరిగి హీరో సాయిధరమ్ తేజ్ ఆస్పత్రి బెడ్ పై పడి ఉండగా.. ఆయన మేనమామ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సినిమా వేదికపై చేసిన విమర్శలు ఏపీ సర్కార్ ను, సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఈ క్రమంలోనే సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అవుతున్న ఈ మూవీపై బోలెడు అంచనాలున్నాయి. సెకండ్ వేవ్ తర్వాత విడుదలైన ‘రిపబ్లిక్’ మూవీ ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. టాక్ బయటకు వచ్చింది. ట్విట్టర్ లో నెటిజన్లు మూవీ గురించి పంచుకుంటున్నారు.

    మంచి కంటెంట్ ఉన్న సినిమాలు తీసే దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ఈ రిపబ్లిక్ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాపై మొదట్లో పెద్ద అంచనాలు లేకున్నా.. పవన్ కళ్యాణ్ ప్రీరిలీజ్ వేడుకకు వచ్చి మూవీకి హైప్ తీసుకొచ్చారు. ‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత ఈ సినిమాను ఏపీ, తెలంగాణల్లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700కు పైగా థియేటర్లలో ఈ మూవీ విడుదలైంది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్ల వరకు దాటినట్లు సమాచారం. 14 కోట్లు దాటితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టు లెక్క.

    ఇప్పటికే ఈ సినిమా ప్రివ్యూ చూసిన దర్శకుడు హరీష్ శంకర్ ‘సినిమాలో సాయితేజ్ అద్భుతమైన నటన, జగపతిబాబు, రమ్యకృష్ణ పాత్రలు అమోహగమని.. హానెస్ట్ స్టోరీ’ అని కామెంట్ చేశాడు. దర్శకుడు మారుతి ‘దర్శకుడు దేవాకట్టా తన నిజాయితీతో అద్భుతమైన కథను ఇచ్చాడని.. అందరూ అద్భుంగా నటించారని’ ప్రశంసించాడు.

    ఇక ఓవర్సీస్ టాక్ చూస్తే.. రిపబ్లిక్ మూవీ ఏపీ రాజకీయాల్లోని ఒక పార్టీకి సంబంధించిన వివాదాస్పదమైన అంశాలను హైలెట్ చేశారని.. డైరెక్టుగా పేర్లు కూడా నెటిజన్లు పంచుకున్నారు. దీంతో ఈ మూవీ మరో వివాదంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరింత అంచనాలు పెరిగే చాన్స్ ఉంది. సాయిధరమ్ తేజ్ నటన అద్భుతం అంటున్నారు.

    ఇక సినిమాకు నెగటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఓవరాల్ గా సినిమా అనుకున్నంత స్థాయిలో లేదంటున్నారు. డిసాప్పాయింట్ పొలిటికల్ థ్రిల్లర్ అంటున్నారు. హిట్ ఫ్లాప్ అనకుండా ఒక సామాజిక అంశాన్ని హైలెట్ చేశారని చెబుతున్నారు. డార్క్ పాలిటిక్స్ నుంచి బయటకొచ్చిచూస్తే సినిమా హిట్ అంటున్నారు.