Renu Desai Second Marriage: పవన్ కళ్యాణ్ భార్యగా రేణు దేశాయ్ పేరు తెలియనోళ్లు ఎవ్వరు ఉండరు..బద్రి సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన రేణు దేశాయ్ ఆ సినిమా సమయం లోనే పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడింది..ఆ తర్వాత కొన్నేళ్ల పాటు సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని అనుకోని కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది..రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్న తర్వాత అన్నా లెజినోవా అనే అమ్మాయిని పెళ్లాడాడు పవన్ కళ్యాణ్..ఇక రేణు దేశాయ్ కూడా రెండవ పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ 2018 వ సంవత్సరం లో అధికారికంగా ప్రకటన చేసింది..ఆమె ఈ ప్రకటన చేసిన తర్వాత సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి తీవ్రమైన తాకిడి ఎదురైంది..దీనితో ఆమె ట్విట్టర్ లో తన అకౌంట్ ని మూసేసింది..అయితే ఈమె రెండవ పెళ్లి చేసుకుంటాను అని ప్రకటన చేసింది..నిశ్చితార్థం కూడా చేసుకుంది కానీ పెళ్లి గురించి మాత్రం ఇప్పటి వరుకు అసలు ఎలాంటి ఊసే లేదు.

పెళ్లి కొడుకు సాఫ్ట్ వేర్ ఉద్యోగి అని..విదేశాల్లో ఎన్నో ప్రముఖ IT కంపెనీలలో టీం లీడర్ గా పని చేసాడని..ఇక ఆ తర్వాత పూణే కి వచ్చి ఇక్కడ IT రంగం లో ఒక దిగ్గజం లాగ రాణిస్తున్నాడు అంటూ స్వయంగా రేణు దేశాయ్ ప్రకటించింది..కానీ ఇప్పటి వరుకు ఆమె రెండవ పెళ్లి చేసుకోలేదు..అయితే తాజాగా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది..’నాకు కూడా ఒక జీవితాంతం తోడు ఉండే మనిషి ఉంటె బాగుండును’ అంటూ ఆమె పెట్టిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది..అదేంటి ఆమెకి ఇది వరకే నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కదా.

త్వరలోనే పెళ్లి చేసుకుంటుంది కదా..మళ్ళీ ఇలాంటి పోస్టులు పెట్టడం ఏమిటి..అంటే పెళ్లి పీటలు ఎక్కకముందే పెటాకులు అయ్యిందా? అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..ఈ కామెంట్స్ పై రేణు దేశాయ్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..ఇది ఇలా ఉండగా రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..రవితేజ హీరో గా నటిస్తున్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో రేణు దేశాయ్ ఒక ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది..ఈ సినిమా తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.
[…] […]
[…] […]