Renu Desai: రేణు దేశాయ్ రెండో పెళ్లి విషయంలో కొడుకు అకీరా అలా అన్నాడా…!

రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్ల క్రితం పూణే నుండి రేణు దేశాయ్ హైదరాబాద్ కు మకాం మార్చింది. కాగా రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. ఆమె పేరెంట్స్ పెళ్లి సంబంధాలు కూడా చూశారట.

Written By: S Reddy, Updated On : March 26, 2024 9:54 am

Renu Desai

Follow us on

Renu Desai: నటి రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె డెబ్యూ మూవీ బద్రి సూపర్ హిట్ కొట్టింది. హీరో పవన్ కళ్యాణ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి అకీరా, ఆధ్య సంతానంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడిపోయారు. పెళ్ళైన నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు.అనంతరం పిల్లలతో పాటు రేణు దేశాయ్ పూణే కి షిఫ్ట్ అయింది. పవన్ కళ్యాణ్ మరో వివాహం చేసుకున్నారు.

రేణు దేశాయ్ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కొన్నాళ్ల క్రితం పూణే నుండి రేణు దేశాయ్ హైదరాబాద్ కు మకాం మార్చింది. కాగా రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం తెలిసిందే. ఆమె పేరెంట్స్ పెళ్లి సంబంధాలు కూడా చూశారట. రేణు దేశాయ్ ఒక వ్యక్తితో మాట్లాడిందట కానీ వర్కౌట్ కాలేదట. అయితే రెండో వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిందట. తనకు వచ్చే వాడు ఎలా ఉంటాడో అని కలలు కూడా కందట. కానీ పిల్లల గురించి ఆలోచించి ఆ ప్రయత్నాలు విరమించుకుందట రేణు దేశాయ్.

ముఖ్యంగా ఆధ్య గురించి ఆమె ఆగిపోయింది. ఆధ్య అప్పటికి చాలా చిన్న పిల్ల కావడంతో .. తాను పెళ్లి చేసుకుంటే ఆధ్య ఏమైపోతుందని ఆ విషయం పక్కన పెట్టేసిందట. అయితే ఓ సందర్భంలో అకీరా, ఆధ్యలు రెండో పెళ్లి చేసుకోమని అన్నారట. నాన్న మరో అమ్మాయిని చేసుకున్నప్పుడు. నువ్వెందుకు సింగల్ గా ఉంటున్నావ్, నువ్వు కూడా చేసుకో అని అకీరా అన్నాడట. దానికి ఆమె .. చేసుకుంటాను బాబు, అర్థం చేసుకునే ఓ మంచి వ్యక్తి దొరకాలి కదా అని చెప్పింది.

అయితే పిల్లలు ఎన్నడూ పవన్ తో విడిపోయిన విషయం గురించి అడిగరని, చాలా మెచ్యూర్డ్ గా ఉంటారని ఆమె అన్నారు. ఇక ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటే గర్వంగా ప్రకటిస్తానని, అందరితో పంచుకుంటాను అని రేణు దేశాయ్ తెలిపింది. అయితే ఈ ఇంటర్వ్యూ ఇచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. ఒకప్పటి రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.