https://oktelugu.com/

Renu Desai : కూతురు ఆద్య విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన రేణూ దేశాయ్..!

ఇటీవల రవి తేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె కనిపించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ రేణుదేశాయ్ తన నటనతో ప్రశంసలు అందుకుంది.

Written By:
  • NARESH
  • , Updated On : March 19, 2024 / 07:41 PM IST

    Renu Desai gave good news about daughter Adya

    Follow us on

    Renu Desai : రేణు దేశాయ్ సోషల్ మీడియా చాలా యాక్టీవ్. తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన సంగతులు పంచుకుంటుంది. హీరో పవన్ కళ్యాణ్ తో విడాకుల తర్వాత తన పిల్లలతో కలిసి ఉంటుంది. పిల్లలే తన ప్రపంచంగా బ్రతుకుతుంది. అకీరా, ఆద్యలు రేణు దేశాయ్ కు రెండు కళ్ళు. రేణు దేశాయ్ పిల్లలకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే ఫ్యాన్స్ తో పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో కూతురు ఆద్యకు గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ చెప్పింది.

    అదేంటంటే .. ఆద్యకు రేణు దేశాయ్ ముక్కు కుట్టించిందట. ఆద్యకు ముక్కు కుట్టించాలని రేణు దేశాయ్ ఎప్పటినుంచో అనుకుంటుందట. అయితే ఏడాది కాలంగా ఆద్య వాయిదా వేస్తూ వస్తుందంట. మొత్తానికి ఇప్పటికి తన కోరిక నెరవేరింది. ఎట్టకేలకు ఆద్య ముక్కు కుట్టించుకుందని రేణు దేశాయ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటో ఆమె షేర్ చేశారు. ఇందులో ఆద్య ముక్కుపుడక తో కనిపించింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    కాగా పిల్లలతో పవన్ కళ్యాణ్ కి సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మెగా ఫ్యామిలీ లో జరిగే ఫంక్షన్స్ కి అకీరా, ఆధ్య అటెండ్ అవుతూ ఉంటారు. కానీ రేణు దేశాయ్ మాత్రం దూరంగా ఉంటారు. ఆ మధ్య జరిగిన కొడుకు అకీరా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం లో రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొన్నారు. ఇక అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడని చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే అకీరాకు మ్యూజిక్, ఫిల్మ్ మేకింగ్ అంటే ఎక్కువ ఆసక్తి చూపుతాడని .. ఏదైనా అతని ఇష్ట ప్రకారం జరుగుతుంది అని రేణు దేశాయ్ వెల్లడించారు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ నటన వైపు అడుగులు వేస్తున్నారు రేణు దేశాయ్. ఇటీవల రవి తేజ నటించిన టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఈ చిత్రంలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆమె కనిపించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ రేణుదేశాయ్ తన నటనతో ప్రశంసలు అందుకుంది.