Renu Desai: ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్ పురానికి చెందిన వ్యక్తి ‘టైగర్ నాగేశ్వరరావు’. 1980 – 90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. మరి అలాంటి టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో రేణు దేశాయ్ చాలా కాలం తర్వాత ఇందులో నటిస్తుండడం విశేషం. తన పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని రేణు తెలిపారు.

కాగా, ఈ చిత్రం రవితేజ కెరీర్‌లోనే ప్యాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నేడు ఉగాది సందర్భంగా టైగర్ నాగేశ్వరరావు ఓపెనింగ్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి చిరు, ది కశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అతిథులుగా హాజరయ్యారు. కాగా, వేడుకలో చిరు ఆసక్తికర విషయాలు తెలిపారు. టైగర్ నాగేశ్వరరావు వాస్తవానికి చిరు చేయాల్సిన సినిమా అన్నారు.
Also Read: Prabhas Radhe Shyam: ప్రభాస్ ఖాతాలోనే ఇది భారీ డిజాస్టర్
అయితే అనుకోకుండా అది రవితేజకి వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు విషయాలు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. పైగా రవితేజ హీరో.. కాబట్టి ఈ సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరగడం ఖాయం. ‘దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లాంటి బిలౌవ్ ఏవరేజ్ సినిమాలు తీసిన డైరెక్టర్ ‘వంశీకృష్ణ’ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు.
కాగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో ఇప్పటికే కృతీ సనన్ సోదరి నుపూర్ సనన్‌ను హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిత్రయూనిట్ మరో హీరోయిన్ ను సెలక్ట్ చేసింది. ఇండియన్ మోడల్, నటి గాయత్రి భరద్వాజ్ కూడా ఇందులో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి రవితేజ ఈ సినిమాలో హీరోగా చేయడానికి బాగా ఆసక్తి చూపించాడు.

మరి రవితేజకు ఈ ‘టైగర్ నాగేశ్వర రావు’ ఎంతవరకూ హిట్ ని ఇస్తాడు అనేది చూడాలి. సినిమాలో అయితే, హీరో పాత్ర దొంగతనం చేసే సీన్స్ చాలా కామెడీగా ఉంటాయట. దర్శకుడు వంశీ ఈ సినిమాని ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. తమిళ మ్యూజిక్ సెన్సేషన్ జివి.ప్రకాష్ ఈ చిత్రాన్ని సంగీతం అందిస్తున్నాడు.
Also Read: Mahesh Babu Rejected Pushpa: మహేష్ ‘పుష్ప’ను రిజెక్ట్ చేయడానికి కారణం అదే