Star Heroes Remuneration: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మంచి విజయాలను సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక మరి కొంతమంది హీరోలు మాత్రం రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడ తగ్గకుండా వాళ్ళు అనుకున్న రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇస్తే సినిమాలు చేస్తున్నారు. వీళ్ళకి కథతో సంబంధం లేదు, సినిమా సక్సెస్ అవుతుందా? లేదా అనే టెన్షన్ లేదు. కేవలం డబ్బుల కోసం సినిమా చేసే హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఏదో ఒక సినిమాతో సక్సెస్ ని సాధిస్తే మరో రెండు మూడు సంవత్సరాల పాటు సక్సెస్ లేకపోయిన కూడా నడుస్తోందని ఆలోచించే హీరోలు కూడా ఉన్నారు. అంతే తప్ప ఒక మంచి కథ దొరికింది. మన రెమ్యూనరేషన్ తగ్గించి తీసుకుందాం… ఎలాగైనా సరే ఈ సినిమాని మనం చేయాలి అనే ధోరణిలో ఎవరు ఆలోచించడం లేదు.
కారణం ఏంటి అంటే సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు స్టార్ హీరోగా మారడానికి వాళ్ళు పడిన కష్టాన్ని ఇప్పుడు డబ్బులు రూపంలో సంపాదించాలనే ప్రయత్నంలో ఉన్నారు…దీనివల్ల వాళ్ళ మార్కెట్ కోల్పోవడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీకి కూడా చాలా వరకు బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.
మలయాళం సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం కథ నచ్చితే చాలా తక్కువ బడ్జెట్ లో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు… ఇక వీలైతే వాళ్ల రెమ్యూనరేషన్ ను సైతం సినిమా బడ్జెట్ మీద కేటాయించి వచ్చిన ప్రాఫిట్స్ లో ఎంతో కొంత పర్సంటేజ్ తీసుకోవాలని చూస్తారు. ఇక మన హీరోలు మాత్రం కథతో సంబంధం లేకుండా ముందుగా అమౌంట్ పే చేస్తేనే వాళ్లు సినిమా షూటింగ్లోకి వస్తారు. లేకపోతే మాత్రం సినిమా నుంచి తప్పుకుంటారు.
ఆ సినిమాకి డేట్స్ ఇవ్వరు… ఇక మొత్తానికైతే తెలుగు హీరోలు చాలా వరకు మారాల్సిన అవసరమైతే ఉంది… ఎప్పుడు డబ్బుల కోసమే కాకుండా కొన్నాళ్లు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నేను ఒకప్పుడు కొన్ని గొప్ప పాత్రలను వేశాను అని గర్వంగా చెప్పుకునే విధంగా సినిమాలు చేస్తే మంచిది…