
Photo Story: నటనా రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మొదటి సినిమానే ప్రత్యేకంగా నిలుస్తుంది. కొందరు హీరోలు ఇండస్ట్రీకి ఎంట్రీతో స్టార్ హీరోగా మారుతారు. ఆ తరువాత ఎన్ని సినిమాలు తీసినా తమ మొదటి సినిగా గురించే రివీల్ చేసుకుంటూ ఉంటారు. అలా తమ మొదటి సినిమా బ్లాక్ బస్టర్ అయినా కొందరికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ మరికొందరికి మాత్రం ఛాన్స్ లు మిస్సయ్యాయి. మరాఠీకి చెందిన ఓ యువకుడు మొదటి సినిమాతోనే ఇండియాలో సెన్సెషన్ క్రీయేట్ చేశాడు. ఆయన సినిమాను మెచ్చిన ఇతర ఇండస్ట్రీలు సైతం హక్కులు దక్కించుకొని రీమేక్ లు తీశారు. కానీ ఇందులో నటించినందుకు ఆ హీరోకు ప్రశంసలు ఇప్పటికీ అందుతున్నాయి.
ఆయన ఎవరో కాదు. ప్రశాంత్ కాలీ. ఆకాష్ తోసర్ అని కూడా పిలుస్తున్న ఈయన మరాఠీ చిత్రం ‘సైరత్ ’తో సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. తన మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. 2016లో రిలీజైన ఈ మూవీ దేశంలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను హిందీలో ‘దడక్’ పేరుతో రీమేక్ చేశారు. ఇది కూడా సక్సెస్ అందుకుంది. అయితే సైరత్ కు వచ్చిన ఆదరణ రాలేదు. ఆ సమయంలో ఆకాష్ కుర్రాడిలా కనిపించి ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు ఆయన పూర్తిగా మారిపోయాడు.
ప్రస్తుతం ఆకాష్ ‘ఘర్ బందుక్ బిర్యానీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఆకాష్ తో పాటు సయాలీ పాటిల్, సాయాజీ షిండేలు కూడా ఇందులో ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు. ‘సైరత్ ’ తరువాత ఆకాష్ జెండ్ అనే సినిమాలో కనిపించాడు. అయితే ఈ సినిమా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో స్టార్ డమ్ దక్కలేదు. ఫస్ట్ మూవీ ‘సైరత్ ’తో పాన్ ఇండియా హీరోగా మారిపోయినా ఆ తరువాత సినిమాలు ప్లాప్ కావడంతో ఆకాష్ కు అవకాశాలు తగ్గాయని అంటున్నారు.

అయితే ఆయన హీరోయిజం లుక్స్ మాత్రం విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. లేటేస్టుగా సోషల్ మీడియాలో ఆకాష్ న్యూ పిక్స్ వైరల్ అవుతున్నాయి. తన మొదటి సినిమా ‘సైరత్’ సినిమాకు సంబంధించిన ఫొటోలతో పాటు లేటేస్టు పిక్ష్ జత చేసి పోస్టులు పెడుతున్నాడు. అయితే ఆకాష్ కు మరిన్ని అవకాశాలు వచ్చి స్టార్ డం రావాలని మనమందరం కోరుకుందాం..