Rebel star Prabhas : ఇటీవలే తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తర్వాత అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ పై మండిపడడం, ఇక మీదట సినిమాలకు టికెట్ రేట్స్, బెనిఫిట్ షోస్ ఇవ్వనని బలంగా చెప్పడం వంటివి జరగడం, ఆ తర్వాత ఇండస్ట్రీ కి ప్రభుత్వానికి మధ్య సమన్వయం ఏర్పాటు చేస్తూ ఫిలిం డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మెన్ దిల్ రాజు గట్టి ప్రయత్నమే చేసాడు. రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీ ఎదుగుదలకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పుకొచ్చాడు. అయితే ఆయన నుండి కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. నగరం లో డ్రగ్స్ వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. యువత దీనికి బానిసై చేరిపోతున్నారు. డ్రగ్స్ వాడకం పై యాంటీ క్యాంపైన్ చేస్తూ సినిమా హీరోలు వీడియోలు చెయ్యాలని, వాటిని సినిమా ప్రారంభం అయ్యే ముందు వెయ్యాలని కోరాడు.
దీనికి సినీ ఇండస్ట్రీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అందులో భాగంగా నేడు రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ వాడకం పై యాంటీ క్యాంపైన్ నిర్వహిస్తూ ఒక వీడియో ని విడుదల చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘లైఫ్ లో మనకి ఎంజాయ్ చేయడానికి బోలెడన్ని మొమెంట్స్ ఉన్నాయి, కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బ్రతికే మనవాళ్ళు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్..సే నో టూ డ్రగ్స్ టుడే..మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈరోజు ఈ ట్రోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి. వాళ్ళు పూర్తిగా కోలుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. టోల్ ఫ్రీ నెంబర్ ఈ ఆర్టికల్ చివరి వీడియో లో ఉంటుంది చూడండి. టీజర్స్, ట్రైలర్స్ ని మీ వాల్స్ మీద షేర్ చేయడం కాదు, ఇలాంటి వీడియోస్ ని మీ వాల్స్ మీద షేర్ చేయండి.
ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి తో ఈ క్యాంపైన్ ని మొదలు పెట్టింది ప్రభుత్వం. ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయించింది. అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు కూడా ఈ క్యాంపైన్ లో పాల్గొన్నారు. ఇక మన టాలీవుడ్ లో మిగిలిన హీరోలు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. ఆయన ఈ క్యాంపైన్ పై మరింత అగ్రెసివ్ గా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన పరిపాలన లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఆయన హీరో గా నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం మార్చి 28 న విడుదల కాబోతుంది. ఆ సమయంలో ఆయన ఈ వీడియో క్యాంపైన్ చేసే అవకాశం ఉంది.
#SayNoToDrugs, says #Prabhas pic.twitter.com/A2jgdd2DKE
— Aakashavaani (@TheAakashavaani) December 31, 2024