https://oktelugu.com/

Manchi Rojulu vachayi: ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమా యూనిట్​కు ప్రభాస్​, బన్నీ విషెస్​…

Manchi Rojulu Vachayi: సంతోష్​ శోభన్​, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. అనూప్​ రూబెన్స్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. వి సెల్యులాయిడ్​, ఎస్కేఎన్​లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​  చిత్రయూనిట్​కు ట్విట్టర్​ వేదికగా విషెష్​ తెలిపారు. ఈ క్రమంలోనే ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ కూడా స్పెషల్​గా ఆల్​దిబెస్ట్​ చెప్పారు. మారుతి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 3, 2021 / 12:30 PM IST
    Follow us on

    Manchi Rojulu Vachayi: సంతోష్​ శోభన్​, మెహ్రిన్​ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో రానున్న చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. అనూప్​ రూబెన్స్​ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రబృందం. వి సెల్యులాయిడ్​, ఎస్కేఎన్​లు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సినిమా విడుదల సందర్భంగా యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​  చిత్రయూనిట్​కు ట్విట్టర్​ వేదికగా విషెష్​ తెలిపారు. ఈ క్రమంలోనే ఐకాన్​స్టార్​ అల్లు అర్జున్​ కూడా స్పెషల్​గా ఆల్​దిబెస్ట్​ చెప్పారు.

    మారుతి తన బెస్ట్​ ఫ్రెండ్​ అని అల్లు అర్జున్​ అన్నారు. చిత్ర నిర్మాతలకు మంచిరోజులొచ్చాయని, చిత్రయూనిట్​ సభ్యులందరికీ ఆల్​దిబెస్ట్​ అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు, మంచి రోజులొచ్చాయి సినిమా నవంబరు 4న థియేటర్లలోకి రానుందని తెలిపిన ప్రభాస్​.. సంతోష్​, మారుతిలకు బెస్ట్​ విషెస్​ అని పేర్కొన్నారు. వెన్నెల కిషోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, సుదర్శన్, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

    మరోవైపు, సలార్​, రాధేశ్యామ్​, ఆదిపురుష్​ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రభాస్​.. ఇటీవలే ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయా సినిమాలకు సంబంధించిన టీజర్స్​, ప్రోమో, పోస్టర్లతో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​తో కలిసి అల్లు అర్జున్​ పుష్ప సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లర్​గా కొత్త క్యారెక్టర్​లో కనిపించనున్న బన్నీ.. ఈ సినిమా కోసం తన ఆహార్యాన్నే మార్చుకున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన శ్రీవల్లి సాంగ్​ నెట్టింట్లో సందడి చేస్తోంది. మరి ప్రభాస్​, బన్నీలు విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.