https://oktelugu.com/

అక్కినేని ఫామిలీ సపోర్ట్ ఉన్న కూడా హీరో సుమంత్ స్టార్ గా ఎదగలేకపోవడానికి 5 కారణాలు ఇవే

Reasons for Hero Sumanth Not A Star Hero: టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి ఉన్న లెగ‌సీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఈ కుటుంబం నుంచి వ‌చ్చిన ఓ హీరో మాత్రం స్టార్ హీరో కాలేక‌పోయాడు. స్టార్ హీరో అవ్వ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్న ఆయ‌న‌.. యావ‌రేజ్ హీరోగా కూడా రాణించ‌లేక‌పోతున్నాడు. ఆయ‌నే సుమంత్‌. అక్కినేని నాగార్జున అల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌. త‌న మొద‌టి సినిమా ప్రేమ‌క‌థ‌తో ఎంతో గ్రాండ్ గా […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 12, 2022 12:42 pm
    Follow us on

    Reasons for Hero Sumanth Not A Star Hero: టాలీవుడ్‌లో అక్కినేని కుటుంబానికి ఉన్న లెగ‌సీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే ఈ కుటుంబం నుంచి వ‌చ్చిన ఓ హీరో మాత్రం స్టార్ హీరో కాలేక‌పోయాడు. స్టార్ హీరో అవ్వ‌డానికి అన్ని అర్హ‌త‌లు ఉన్న ఆయ‌న‌.. యావ‌రేజ్ హీరోగా కూడా రాణించ‌లేక‌పోతున్నాడు. ఆయ‌నే సుమంత్‌. అక్కినేని నాగార్జున అల్లుడిగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్‌.

    త‌న మొద‌టి సినిమా ప్రేమ‌క‌థ‌తో ఎంతో గ్రాండ్ గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ మూవీ తీవ్ర నిరాశ చెందేలా చేసింది. ఇక రెండో మూవీ యువ‌కుడు కూడా యావ‌రేజ్‌. రెండు మూవీలు ప్లాప్ అయిన త‌ర్వాత ఎంతో జాగ్ర‌త్త‌గా లెజెండ్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు డైరెక్ష‌న్ లోచేసిన పెండ్లి సంబంధం కూడా పెద్ద ప్లాప్ అయింది.

    Reasons for Hero Sumanth Not A Star Hero

    Sumanth Akkineni

    అయితే నాగార్జునతో క‌లిసి చేసిన స్నేమ‌మంటే ఇదేరా, రామ్మా చిల‌క‌మ్మా కూడా పెద్ద ప్లాప్ అయ్యాయి. అయితే ఆయ‌న‌కు న‌టుడిగా మాత్రం ఈ రెండు సినిమాలు గుర్తింపును తీసుకువ‌చ్చాయి. అయితే రెండేండ్ల త‌ర్వాత చేసిన స‌త్యం మంచి స‌క్సెస్ ఇచ్చింది. దాని త‌ర్వాత గౌరి, గోదావ‌రి మూవీలు మంచి ఇమేజ్‌ను తెచ్చిపెట్టాయి. కాగా దీని త‌ర్వాత 2011దాక ఎలాంటి హిట్ లేదు. ఇక మ‌ళ్లీ రావా మూవీతో హిట్ కొట్టాడు. దీని త‌ర్వాత ప్ర‌స్తుతం ఆయ‌న క‌ప‌ట‌దారి మూవీతో వ‌స్తున్నాడు.

    Also Read: Super Star Krishna: భారీ బడ్జెట్ చిత్రాల ట్రెండ్ కు నాంది పలికిన సూపర్ స్టార్ కృష్ణ

    ఇక్క‌డ చూసుకుంటే ఆయ‌న చేసిన మూవీలు అన్నీ కూడా చాలా డిఫ‌రెంట్ మూవీలే. కొంచెం ప్ర‌యోగాత్మ‌క సినిమాలు. మ‌రి అక్కినేని లెగ‌సీ ఉండి, స్టార్ డైరెక్ట‌ర్ల‌తో మూవీలు చేయించినా.. ఆయ‌న ఎందుకు స్టార్ హీరో కాలేక‌పోయాడ‌న్న‌ది ఇక్క‌డ పాయింట్. ఇందుకు ఓ నాలుగు కార‌ణాలు ఉన్నాయి. పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుంచి వ‌చ్చిన హీరోల‌కు మొద‌టి సినిమా క‌చ్చితంగా హిట్ కొట్టాలి. కానీ సుమంత్ మూడు, నాలుగు సినిమాల దాకా హిట్ ప‌డ‌లేదు.

    పైగా చేసిన‌వ‌న్నీ కూడా మాస్ ప‌ల్స్ లేని సినిమాలు. దాంతో పాటు కొన్ని బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల‌ను వ‌దులుకోవ‌డం. నువ్వే కావాలి, మ‌న‌సంతా నువ్వే, తొలిప్రేమ‌, ఇడియ‌ట్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలను వ‌దుల‌కున్నాడు. ఒక‌వేళ ఇవ‌న్నీ చేసి ఉంటే అత‌ను స్టార్ హీరో అయ్యేవాడు. ఇదే కాకుండా మ‌ధ్య‌లో చాలా కాలం గ్యాప్ తీసుకోవ‌డంతో ఫ్యాన్స్‌ను మెయింటేన్ చేయ‌లేక‌పోయాడు.

    ఒక హీరోగా రాణించాలంటే మాస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలి. సుమంత్‌కు ఇదే మిస్ అయింది. ఆయ‌న ఎప్పుడూ కొత్త ప్ర‌యోగాల‌ను చేశాడు త‌ప్ప‌.. క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ప్ర‌య‌త్నించ‌లేదు. ఇలా అనేక ర‌కాల కార‌ణాల వ‌ల్ల మ‌హేశ్‌, ప‌వ‌న్ స‌ర‌స‌న స్టార్ గా ఉండాల్సిన సుమంత్ ఇప్పుడు క‌నీసం యావ‌రేజ్ హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకోలేక‌పోతున్నాడు.

    Also Read: Aadavallu Meeku Johaarlu Box Office Collection: ఫస్ట్ వీక్ లో దారుణంగా తేలిపోయిన ‘ఆడవాళ్లు..’

    Tags