Samantha: స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత సడన్ గా నాగ చైతన్య తో విడాకులు తీసుకుని టాక్ అఫ్ ది టాలీవుడ్ గా మారింది. చైతన్య తో భార్య గా కాకుండా ఒక స్నేహితురాలిగా ఉంటానని తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో వెల్లడించింది. టాలీవుడ్ లో నే బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న ఈ జంట ఒక్కసారిగా విడిపోవడంతో యావత్ సినీ లోకమే నివ్వెర పోయింది. ఈ విషయాన్ని సమంత – చైతన్య అభిమానులు అయితే ఇప్పటికి జీరించుకోలేకపోతున్నారు.

ఎవరేమనుకున్నా, వాళ్ళ దాంపత్య బంధం లో ఏం జరిగినా … అది మాత్రం బయటకి రాకుండా నాగ చైతన్య – సమంత మాత్రం వాళ్ళ దారులు చూసుకుని ఒంటరి జీవితం లోకి అడుగు పెట్టారు. అక్టోబర్ 2 న మధ్యాహ్నం సమంతా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా నుండి నాగ చైతన్యతో విడిపోతున్నట్టు వివరించింది. అదే సమయానికి నాగ చైతన్య కూడా తన ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతా నుండి సమంత తో విడిపోతున్నట్టు తెలిపాడు.
ఈ నేపథ్యం లో సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో ఏం పోస్ట్ పెట్టిన సరే ఇట్టే వైరల్ అయ్యి ట్రేండింగ్ లో నిలుస్తుంది. అయితే తాజా గా సమంత తన ప్రాణ స్నేహితురాలయిన శిల్పా రెడ్డి తో కలిసి చార్ ధామ్ యాత్ర కి వెళ్ళింది. వాటికి సంబందించిన ఫోటోలను ఒకవైపు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా లో పంచుకోగా మరోవైపు శిల్పా రెడ్డి కూడా హాలిడే కి సంబంధించిన ఫోటోలను తన ఖాతాలో పోస్ట్ చేస్తూ సమంతా అభిమానులకి అప్ డేట్స్ ఇస్తూ ఉంది.

సమంతా, శిల్పా రెడ్డి ఇద్దరూ ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తులు. బహుశా ఆ భావాలే వాళ్ళిద్దరిని మంచి స్నేహితులుగా మారేట్టు పునాదులు వేసాయి. ఇరువురికి సద్గురు అంటే చాలా ఇష్టం.. అంతే కాకుండా యోగా , ఫిట్ నెస్ లో కూడా మంచి ప్రావిణ్యం ఉంది. మానసిక ప్రశాంతత కోసం తన స్నేహితురాలు శిల్పా రెడ్డి తో కలిసి అక్టోబర్ 20న ఆధ్యాత్మిక యాత్ర కి బయలు దేరింది సామ్. అలా చార్ ధామ్ ని చుట్టి వేస్తూ దానికి సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది.
ఈ క్రమం లో తాజాగా ఒక ఫోటో ని సమంత తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టింది. ఆ స్టోరీ లో ఈ విధంగా ఉంది … ‘ధ్యాన గుహని’ గంగా నది తీరంలో ఉన్న రాళ్ల చే ఒక గుహని 1976 – 78 ప్రాంతం లో సన్యాసులు, బ్రహ్మచారులకు ధ్యాన సాధన కొరకు నిర్మించినట్టు ఉంది. అయితే ఆ ఫోటోని ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో పెట్టి ఒక్క నిమిషం అవ్వగానే డిలీట్ చేసింది. అయితే దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అన్నది ఎవరికీ అర్ధం కావట్లేదు. మరి సమంతా సన్యాసిగా మారుతుందో లేదో చూడాలి అంటే రాబోయే రోజుల వరకు ఎదురు చూడాల్సిందే.