Posani Krishna Murali: ఎన్నో అంచనాల తర్వాత జగన్ తో భేటీకి చిరంజీవి టీమ్ ఈరోజు తాడేపల్లికి ప్రైవేట్ జెట్‌లో వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఎన్నడూ పెద్దగా ఇలాంటి చర్చల్లో పాల్గొనని యంగ్ హీరోలు మహేశ్, ప్రభాస్ లు కూడా ఈ భేటీకి రావడం ఇక్కడ విశేషం. అయితే చిరంజీవితో సీఎంను కలవడానికి చాలామంది వచ్చారు.
ఇందులో దర్శక ధీరుడు రాజమౌళి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నటుడు అలీ, ఆర్. నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి లాంటివారు ఉన్నారు. కాగా వీరందరూ వెళ్లి సీఎం జగన్‌తో గంట సేపు కూల్ వాతావరణంలో చర్చించిన తర్వాత అందరూ బయటకు వచ్చారు. కాగా ఇలా బయటకు వచ్చిన తర్వాత వారంతా మీడియాతో మాట్లాడారు.
చిరంజీవితో పాటు మహేశ్, ప్రభాస్, రాజమౌళి, కొరాటాల శివలు చిరంజీవికి, జగన్‌కు థాంక్స్ చెప్పారు. అందరూ చిరంజీవి కృషి వల్లే ఈ సమస్యకు పరిష్కారం దొరికిందంటూ చెప్పుకొచ్చారు. ఆయనకు జగన్‌తో ఉన్న సన్నిహిత్యంతో అందరికీ ఒక దారి చూపించారని చెప్పుకొచ్చారు. కాగా పోసాని కృష్ణ మురళి మాత్రం మీడియా ముందుకు రాలేదు.
Also Read: టాలీవుడ్ టికెట్ల వివాదానికి శుభం కార్డ్.. త్వరలోనే గుడ్ న్యూస్
జగన్ తో భేటీ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. అంటీ ముట్టనట్టు ఏదో వచ్చామా అంటూ వచ్చాం అన్నట్టు ఉన్నారు. అంతే తప్ప ఎక్కడా నోరు విప్పింది లేదు. పవన్ కల్యాణ్ మీద వివాదాస్పద కామెంట్లు చేసినప్పటి నుంచి ఆయన మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీలో చాలామంది ఆయన్ను దూరం పెడుతున్నారు.
అప్పటి నుంచే ఆయన బయట ఎక్కడా కనిపించట్లేదు. ఈ భేటీలో కూడా చిరుకు దూరంగానే ఉన్నారు పోసాని. అయితే ముందే ఆయనకు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చారా అనేది ఇక్కడ చర్చనీయాంశం. మీడియాతో కేవలం చిరంజీవి అనుకూల వర్గం మాత్రమే మాట్లాడింది. వారంతా చిరంజీవిని పొగడ్తలతో ముంచెత్తారు. కానీ పోసానిని మాత్రం దూరంగా పెట్టినట్టు తెలుస్తోంది. పోసాని మీడియా ముందు ఏమైనా తప్పుగా మాట్లాడితే సమస్య వస్తుందని ఆయన్ను కావాలనే దూరంగా ఉంచారా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా చిరంజీవి తానే ఇండస్ట్రీకి దిక్కు అనిపించేసుకున్నారు.
Also Read: ఏమయ్యా మంచు.. ఏదేదో అన్నావ్, ఏమైపోయావ్ ?