https://oktelugu.com/

Nayanthara: అప్పట్లో నయనతారకు ఫైన్ వేసిన ‘మా’ అసోసియేషన్.. కారణం ఏంటంటే..?

ఒకప్పటి సావిత్రి దగ్గర నుంచి ఇప్పుడున్న శ్రీలీలా వరకు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారే కావడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : April 3, 2024 / 01:04 PM IST

    Reason behind Maa association fined Nayanthara

    Follow us on

    Nayanthara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ సక్సెస్ లను సాధిస్తు ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ ఉంటారు.

    ఒకప్పటి సావిత్రి దగ్గర నుంచి ఇప్పుడున్న శ్రీలీలా వరకు ప్రతి ఒక్క హీరోయిన్ కూడా ఇండస్ట్రీలో వరుస సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోయిన్లుగా ఎదిగినవారే కావడం విశేషం…ఇక ఒకానొక సమయంలో నయనతార తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో సూపర్ సక్సెస్ లను అందుకుంది. అయితే ఈమె నాగార్జునతో చేసిన ‘ బాస్’ సినిమా సమయంలో ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా)లో తన మెంబర్ కాదనే ఉద్దేశ్యంతో తనను సినిమాలో తీసుకోకూడదని అప్పటి ‘మా’ ప్రెసిడెంట్ అయిన మురళీమోహన్ ఆ సినిమా షూటింగ్ ను ఆపేసినట్టుగా అప్పట్లో వార్తలైతే వచ్చాయి.

    ఎందుకంటే మా అసోసియేషన్ లో కార్డు తీసుకున్న వాళ్ళని సినిమాల్లో తీసుకోవాలనే ఉద్దేశ్యం తోనే ఆయన అలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆమె కార్డు తీసుకోకుండా నటిస్తుంది కాబట్టి ఆమె మీద ఫైన్ కూడా వేశారట. ఆ ఫైన్ తను చెల్లించను అని నయనతార తెగేసి చెప్పింది. అయితే సినిమాల్లో నటించడానికి వీల్లేదు అని మా అసోసియేషన్ ఒక రూల్ అయితే పాస్ చేసింది. ఇక దానికి తగ్గట్టుగానే నాగార్జున మధ్యవర్తిగా వ్యవహరించి నయనతార ను ఒప్పించి తనచేత ఆ ఫైన్ అమౌంట్ ని కట్టించాడట. ఈ విషయంలో నాగార్జున నయనతార తో ఇలా చెప్పాడట. డబ్బుల కోసం చూసుకుంటే ఇక్కడ నీ కెరియర్ అనేది సాఫీగా సాగలేదు.

    కాంట్రవర్సీలో ఇరుక్కుంటే నీకు అవకాశాలు రావు అని నయనతారతో చెప్పి తనని ఒప్పించి ఆ ఫైన్ కట్టించినట్టుగా వార్తలైతే వచ్చాయి. ఇక నయనతార ఈ విషయంలో చాలా ఫైర్ అయినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక మొత్తానికైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నయనతార తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ వరుసగా సినిమాలు చేస్తూ సూపర్ డూపర్ సక్సెస్ లని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది…