NTR : ఎన్టీఆర్(NTR) మనవడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, నూనూగు మీసాలు రాని వయస్సులోనే సూపర్ స్టార్ స్టేటస్ ని సంపాదించి మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్(Junior NTR). నేటి తరం హీరోలలో టాలెంట్ అనే పదానికి పర్యాయపదం లాంటిది వాడు ఎన్టీఆర్. ఆయన పోషించలేని క్యారక్టర్ అంటూ ఏది లేదు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేసి అద్భుతంగా నటించగలడు ఎన్టీఆర్. కెరీర్ లో అందరి హీరోలు లాగానే ఈయన కూడా తప్పటడుగులు వేశాడు. కానీ వాటిని సరిదిద్దుకొని అతను ఎదిగిన తీరు రాబోయే తరాల హీరోలకు కూడా ఆదర్శప్రాయం. ఎన్టీఆర్ కెరీర్ ని విభజించాసి వస్తే మూడు భాగాలుగా విభజించవచ్చు. అతి చిన్న వయస్సులో సూపర్ స్టేటస్ ని సంపాదించినప్పుడు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు.
ఆ శరీరం తో మనలాంటి వాళ్లకు కదలడమే చాలా కష్టం. కానీ ఎన్టీఆర్ భీభత్సమైన డ్యాన్స్ లు ఆ శరీరంతోనే చేసేవాడు. అది చూసి అసలు ఇతను మనిషా?, లేకపోతే కారణజన్ముడా?, ఈ శరీరంతో ఆ స్థాయి డ్యాన్స్ ఎలా సాధ్యం అని విశ్లేషకులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేసేవారు. అయితే సింహాద్రి తర్వాత యమదొంగ వరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ముఖ్యంగా రాఖీ లో అయితే దారుణమైన లుక్స్ తో ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాకు వెళ్లాలంటే ఆలోచించేలా ఉండేవాడు. ఆ సమయంలోనే ఆయన రాజమౌళి తో ‘యమదొంగ’ సినిమా కమిట్ అయ్యాడు. రాజమౌళి ఇచ్చిన సూచనల మేరకు సన్నగా మారిపోయి అప్పటి ఆడియన్స్ ని షాక్ కి గురయ్యేలా చేసాడు ఎన్టీఆర్. ఇక్కడి నుండి ఆయన రెండవ ఫేస్ మొదలైంది. హిట్స్ వచ్చాయి, ఎప్పుడూ చూడనన్ని ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి. ఎన్టీఆర్ మైండ్ సెట్ ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది రభస అని చెప్పొచ్చు.
Also Read : హీరో రామ్ దగ్గర నుంచి కావాలనే ఎన్టీఆర్ ఆ సినిమాను లాక్కున్నాడా.? ఇంతకీ ఆ సినిమా ఏంటంటే..?
ఆయన కెరీర్ లోనే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది ఆ చిత్రం. ఆ సమయంలో ఆయన అభిమానులకు ఒక్కటే మాట ఇచ్చాడు. ఇక నుండి మీరు కాలర్ ఎగరేసుకునే సినిమాలు మాత్రమే చేస్తానని మాట ఇచ్చాడు. అలా ఇచ్చిన మాటని తూచా తప్పకుండా అనుసరిస్తూ వస్తున్నాడు. ‘టెంపర్’ తో మొదలైన ఆయన విజయపరంపర ‘దేవర’ వరకు సాగింది. నందమూరి అభిమానులు ఎత్తిన కాలర్ ని దించనివ్వకుండా చేసాడు. ఇది ఆయనకు మూడవ ఫేస్ అనొచ్చు. సినీ రంగం పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ కి మరో దశాబ్దం తిరుగు లేదు. కానీ రాజకీయ పరిస్థితి ఏమిటి?. 2009 వ సంవత్సరం లో పాతికేళ్ల వయస్సులోనే రాజకీయ రణరంగంలోకి దూకి ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగాలు అప్పట్లో ఎలాంటి ప్రకంపనలు రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆ ఎన్నికల తర్వాత కొన్నాళ్ళు టీడీపీ లో యాక్టీవ్ గా ఉంటూ వచ్చాడు కానీ, ఏమైందో ఏమో తెలియదు, రాజకీయాలకు దూరమయ్యాడు. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆయన జాతకం చూసిన ఏ జ్యోతిష్యుడు అయినా యోగం ఉందనే చెప్తాడు, కానీ టీడీపీ లోకి వచ్చే అవకాశాలు దగ్గర్లో కనిపించడం లేదు. మరోపక్క టీడీపీ పగ్గాలు నారా లోకేష్ చేతికి త్వరలోనే వెళ్లనుంది. మరి ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి?, ఎప్పుడు రాజకీయ అరంగేట్రం చేస్తాడు అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. 2034 సంవత్సరం లోపు ఆయన రాజకీయ అరంగేట్రం చేసే అవకాశం ఉన్నది.