Siblings Of Tollywood: సినీ ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచం కాగా, ఇక్కడ ఒక్కరు సక్సెస్ అయితే చాలు.. వారిని మిగతా వారు ఆదర్శంగా తీసుకుంటుంటారు. ఇకపోతే తమ ఇంట్లో ఎవరైనా సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నట్లయితే ఆటోమేటిక్‌గా మిగిలిన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా తమ అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవాలనుకుంటారు. ఈ సంగతులు అలా ఉంచితే..సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించడం కొంచెం కష్టమే అని కొందరు చెప్తుంటారు.
హీరోయిన్ గా రాణించాలంటే గ్లామర్ తో పాటు ప్రతిభ, అవకాశాలు ఉండాలని చెప్తుంటారు. అలా తొలినాళ్లలో అందం, అభినయానికి ప్రాధాన్యతనిచ్చి చాలా మంది హీరోయిన్స్ గా అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో నుంచి ఒకరు హీరోయిన్ అయితే, వారి ఇంటి నుంచే వారికి కాంపిటీషన్‌గా వారి సోదరీమణులు ఇండస్ట్రీలోకి వచ్చారు. అలా వారు రావడమే కాదు సక్సెస్ అయ్యారు కూడా. అలా అక్కా చెల్లెళ్లు సినీ పరిశ్రమలో సక్సెస్ అయిన వారు ఉన్నారు. వారు ఎవరెవరంటే..
షావుకారు జానకి, కృష్ణ కుమారి. జానకి అక్క కాగా, కృష్ణకుమారి చెల్లెలు, వీరిరువురు తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికలుగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా జానకిని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. జానకి వెండితెర మహారాణి, మహానటి సావిత్రి కంటే ముందే సినిమాల్లోకి ప్రవేశించింది. 90 ఏళ్ల వయస్సు దాటినప్పటికీ ఈమె ఇంకా నటిస్తూనే ఉంది.

నగ్మా సినీ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన పేరు సంపాదించుకుంది. ఈమె ఆ తర్వాత కాలంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ హీరోయిన్‌గానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె చెల్లెళ్లు జ్యోతిక, రోషిని కూడా హీరోయిన్స్‌గా రాణించారు. కార్తీక నాయర్, తులసి నాయర్ ఇద్దరూ కూడా సినిమాల్లో హీరోయిన్స్‌గా రాణించారు. ఇటీవల కాలంలో యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతర్లు శివానీ-శివాత్మిక .. ఇద్దరూ టాలీవుడ్ లో వర్ధమాన హీరోయిన్స్‌గా రాణిస్తున్నారు. విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ కూతుర్లు శృతిహాసన్, అక్షర హాసన్..లు కూడా హీరోయిన్స్‌గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నారు. కాజల్ అగర్వాల్, నిషా అగర్వాల్ ఇద్దరూ హీరోయిన్స్‌గా రాణించారు. అయితే,నిషా అగర్వాల్ హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేయగానే సినీ కెరీర్ కు ఫులిస్టాప్ పెట్టేసి, వైవాహిక జీవితంలోకి వెళ్లిపోయింది. సంజన- నిక్కీ గల్రానీ, ఆర్తి అగర్వాల్-ఆదితి అగర్వాల్, శాలిని-శామిలి, రాధిక-నిరోషా,అంబిక-రాధా,జయసుధ-సుభాషిణి, జ్యోతిలక్ష్మి-జయమాలని, భాను ప్రియ- శాంతిప్రియ ఇలా అక్కాచెల్లెళ్లు ఇండస్ట్రీలోకి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారు.




Also Read: Tollywood hero, Megastar Chiranjeevi tested positive for COVID-19


[…] OKtelugu MovieTime : మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. టాలీవుడ్ యంగ్ బ్యూటీ ‘అనన్య నాగళ్ల’ తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియా పై విరుచుకు పడింది. మొత్తానికి అనన్య అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతూ ‘నడుము చూపించి, చంపేస్తోంది సర్.. కేసు పెట్టండి’ అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. మల్లేశం, వకీల్ సాబ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ‘అనన్య నాగళ్ల’ .. ప్రస్తుతం సినిమా ఛాన్స్ ల కోసం ఎదురుచూస్తోంది. అందుకే, ఎక్స్ పోజింగ్ లో మరో మెట్టు ఎదిగింది. […]