
Real Life Husband and Wife: ఒక సినిమాను మనం చూసినప్పుడు అందులో చాలా జంటలు మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంటాయి. అలా సినిమాలో కలిసి నటించిన వారు రియల్ లైఫ్ లో భార్యభర్తలయ్యారు. మరి వారెవరో చూసేద్దామా.. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల వీరిద్దరూ సాక్షి అనే మూవీలో యాక్ట్ చేశారు. అప్పటికే వీరిద్దరికీ వేరే వారితో మ్యారేజ్ అయింది. కానీ వీరిద్దరు ప్రేమలో పడిన తర్వాత పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. కానీ కొంత కాలం క్రితమే విజయ నిర్మల చనిపోయారు.

అప్పుడు కృష్ణ తన దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. విజయనిర్మల ఏకైక కుమారుడు నరేశ్. ఇక జీవిత, రాజశేఖర్.. తలంబ్రాలు మూవీలో రాజశేఖర్ విలన్ గా యాక్ట్ చేయగా, జీవిత హీరోయిన్ గా నటించింది. అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక నాగార్జున, అమల.. వీరిద్దరూ కలిసి శివ మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత నిర్ణయం మూవీలోనూ యాక్ట్ చేశారు. అప్పటికే ప్రేమలో పడిన వీరిద్దరూ తర్వాత పెళ్లి చేసుకున్నారు.

శ్రీకాంత్ సరసన హీరోయిన్ గా ఊహ చాలా మూవీస్ లో యాక్ట్ చేసింది. తర్వాత వారిద్దరూ ఒక్కటయ్యారు. వీరికి ముగ్గురు పిల్లలు సైతం ఉన్నారు. ఇక మహేశ్ బాబు, నమ్రత.. వంశీ మూవీలో యాక్ట్ చేశారు. అప్పడే వీరద్దరూ లవ్ లో పడ్డారు. ఐదేళ్ల తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు సైతం ఉన్నారు. సంక్రాంతి మూవీలో వెంకటేశ్ కు తమ్ముడిగా నటించిన శివబాలాజీ చాలా సినిమాలే చేశాడు. ఆయన సహనటి మధుమితను పెళ్లి చేసుకున్నాడు.

Also Read: రష్మిక అమాయకత్వమే మెయిన్ హైలైట్ అట !
ఇక హ్యాపీడేస్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరున్ సందేశ్.. భీమిలి కబడ్డీ జట్టు, ఝమ్మంది నాదం మూవీస్ లో యాక్ట్ చేసిన వితికా శేరును పెళ్లి చేసుకున్నాడు. ఇక టాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిక్ కపుల్ నాగచైతన్య, సమంత. ఏమాయ చేసావే మూవీతో ఫస్ట్ హిట్ అందుకున్నారు. అనంతరం పలు మూవీస్ లో యాక్ట్ చేసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరే కాకుండా.. పవన్ రేణు దేశాయ్, శరత్ బాబు రమాప్రభ, చలం శారద వంటి వారు సైతం ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్నవారే. ఇక వీరిలో కొందరు విడిపోయారు.

Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !