Pawan Kalyan Mahesh Babu: మన టాలీవుడ్ లో మొదలైన రీ రిలీజ్ ట్రెండ్ ఇప్పుడు దేశమంతటా పాకింది. సూపర్ స్టార్స్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన కొన్ని సూపర్ హిట్ చిత్రాలను , రీ మాస్టర్ చేయించి , 4K క్వాలిటీ తో విడుదల చేయిస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే అత్యధిక శాతం సూపర్ హిట్స్ ని అందుకున్నారు. రికార్డ్స్ కూడా కేవలం వీళ్లిద్దరి చుట్టూనే తిరుగుతున్నాయి. మిగిలిన స్టార్ హీరోలు కనీస స్థాయి గ్రాస్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతున్నారు. మంచి పాటలు ఉన్నటువంటి సినిమాలతో అయితే మంచి కలెక్షన్స్ ని కొల్లగొడుతున్నారు కానీ , మిగిలిన సందర్భాల్లో అడ్డంగా దొరికిపోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా , ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ‘రేసు గుర్రం’ చిత్రాన్ని ఏప్రిల్ 8 న విడుదల చేయబోతున్నారు మేకర్స్.
టాలీవుడ్ లోనే పీక్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా, కచ్చితంగా రీ రిలీజ్ ట్రెండ్ లో ఆల్ టైం రికార్డుని నమోదు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ కనీసం ప్రింట్ ఖర్చులను రాబట్టే రేంజ్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ నమోదు అవ్వడం లేదు. టాలీవుడ్ హిస్టరీ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల పుట్టినరోజు కి విడుదలైన సినిమాల్లో ఇలాంటి చెత్త రికార్డు ఎప్పుడూ నామోదు అవ్వలేదు. ఇలాంటి సందర్భాలు చూసిన తర్వాతే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు రీ రిలీజ్ సినిమాల విలువ తెలుస్తుందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్ లో హిస్టారికల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే దాదాపుగా మొదటి రోజే 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
అదే విధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ , ‘మురారి’ వంటి చిత్రాలు ఫుల్ రన్ లో 10 కోట్ల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లను నమోదు చేసుకున్నాయి. ఇప్పటి వరకు మహేష్ బాబు పోకిరి , ఖలేజా , బిజినెస్ మ్యాన్ మరియు మురారి చిత్రాలతో ఆల్ టైం రికార్డ్స్ నమోదు చేస్తే, పవన్ కళ్యాణ్ జల్సా, ఖుషి, గబ్బర్ సింగ్ చిత్రాలతో ఆల్ టైం రికార్డ్స్ ని నమోదు చేశారు. ఎందుకు వీళ్లిద్దరి సినిమాలకే అంత క్రేజ్ అంటే, ఆ రోజుల్లో వీళ్ళు చేసిన సినిమాలు ఆ రేంజ్ లో ఉండేవి మరి. ఇక పోతే ఈ నెల 23 న ప్రభాస్ ‘డార్లింగ్’ చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉంది, మరి పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు సాధించిన రికార్డ్స్ ని ఈ చిత్రం కొల్లగొడుతుందో లేదో చూడాలి.