AR Rahman : ఇండియాలోనే అత్యంత పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన ఏ ఆర్ రహమాన్ గురించి మనం ప్రత్యేకం గా చెప్పాల్సిన అవసరం లేదు. స్లామ్ డాగ్ మిలియనీర్ సినిమాతో ఆస్కార్ అవార్డ్ ను గెలుచుకున్న మొదటి ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రెహమాన్ దుబాయిలో జరిగిన ‘అబ్యూడెన్స్ ఫర్ ఫ్యూచర్ బై ఎస్ డబ్ల్యు ఎఫ్ ఐ’ లో పాల్గొన్నారు. ఇక ఇందులో ముఖ్యంగా ఆరు డైనమిక్ వర్చువల్ సంగీతకారులతో కూడిన గ్లోబల్ మ్యూజికల్ బ్యాండ్ మెటా హ్యూమన్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ బ్యాండ్ ద్వారా వివిధ సంస్కృతుల మధ్య ఉన్న విభేదాలను తొలగించి మానవత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పారు.ఇక దీని ద్వారా విజువల్ ఎఫెక్ట్స్ అలాగే మోషన్ క్యాప్చర్ ని కూడా వాడుతూ అత్యాధునికమైన సాంకేతిక మార్గాలతో కూడా మ్యూజిక్ ని క్రియేట్ చేయొచ్చు అని తెలియజేశాడు.
ఇక ఇదిలా ఉంటే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ‘లాల్ సలాం’ సినిమాలో ఒక ట్రాక్ పాడించడం కోసం ఈ అత్యాధునికమైన సాంకేతిక విధానాన్ని అనుసరిస్తునే దివంగత గాయకుడు అయిన బంబా బక్య మరియు హాహూల్ హమీద్ లా స్వరాలను రీ క్రియేట్ చేయడానికి ఏ ఐ విధానాన్ని కూడా అనుసరించాడు. అయితే ఇలా చనిపోయిన వాళ్ళ వాయిస్ రీ క్రియేట్ చేయడం అనైతికమంటూ చాలా మంది రెహమాన్ మీద విమర్శలను చేస్తున్నారు. అయితే దీనిమీద రెహమాన్ స్పందిస్తూ ‘మేము ఒక ట్రాక్ కోసం వారి ఆల్ గారిధమ్ లను తీసుకున్నందుకు గాను ముందుగానే వాళ్ల కుటుంబ సభ్యుల దగ్గర పర్మిషన్స్ తీసుకున్నాం’ అంటూ జనాలందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు.
ఇక ప్రస్తుతం వాళ్ల వాయిస్ ని రీ క్రియేట్ చేస్తూ ఒక ట్రాక్ ని కూడా క్రియేట్ చేయనున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే రెహమాన్ రజినీకాంత్ కాంబో లో వచ్చిన చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు ఈ సినిమా కూడా మ్యూజికల్ హిట్ గా నిలువబోతున్నట్టు గా తెలుస్తుంది…