Mass Maharaja Movie Trailer Review : మాస్ మహారాజ రవితేజ(Mass Maharaja Raviteja) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర'(Mass Jathara Movie) చిత్రం నవంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ముందుగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 31 న విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా విడుదల కాబోతుంది. కానీ అక్టోబర్ 31న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ మాత్రం ఉంటాయట. ప్రీమియర్ షోస్ నుండి వచ్చే టాక్ ని బట్టే, ఈ సినిమా భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇకపతే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రవితేజ నుండి ఆడియన్స్ ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో, అవన్నీ ఈ చిత్రం లో ఉన్నట్లు స్పష్టంగా ట్రైలర్ ని చూస్తేనే తెలుస్తుంది.
రవితేజ మార్క్ హీరోయిజం తో పాటు, ఆయన మార్క్ కామెడీ టైమింగ్ కూడా గట్టిగానే ఉన్నట్టు అనిపిస్తుంది. రవితేజ సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటైన వెంకీ చిత్రం లోని ఒక కామెడీ సన్నివేశాన్ని కూడా స్పూఫ్ చేసారు, అది కూడా వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది. ట్రైలర్ ని చూస్తుంటే అర్థమైన కథ ఏమిటంటే ఇందులో రవితేజ ఒక పవర్ ఫుల్ రైల్వే ఆఫీసర్ గా కనిపిస్తాడు. స్మగ్లింగ్ వ్యాపారం లో ఆరితేరిన విలన్, తన రైల్వే స్టేషన్ లోని గూడ్స్ బండి లో స్మగ్లింగ్ చేసే విషయాన్ని గమనించిన రవితేజ, దానిని అడ్డుకుంటాడు. అక్కడి నుండి రవితేజకి విలన్ కి మధ్య గొడవ మొదలు అవుతుంది. అది ఎక్కడి వరకు దారి తీస్తుంది, మధ్యలో ఎదురైనా సందర్భాలు ఏంటి అనేది సినిమా స్టోరీ.
ఇందులో విలన్ గా నవీన్ చంద్ర నటించాడు. టీజర్ లో డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోలేదు కానీ, ట్రైలర్ లో మాత్రం డైలాగ్స్ బాగా పేలాయి. నేను రైల్వే పోలీస్ కాదు, క్రిమినల్ పోలీస్ ని అంటూ రవితేజ చెప్పే డైలాగ్ ఈ ట్రైలర్ లో హైలైట్ అని చెప్పొచ్చు. అదే విధంగా వందేమాతరం ఎవరు రాసారు రా అని రవితేజ రౌడీలను అడగడం, అందుకు రౌడీ పూరి జగన్నాథ్ అని సమాధానం ఇవ్వడం వంటివి కూడా ఆకర్షించాయి. విలన్ నవీన్ చంద్ర క్యారక్టర్ కూడా చాలా పవర్ ఫుల్ గా అనిపించింది. ఆయన డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏమిటంటే శ్రీలీల అనే చెప్పొచ్చు. ఆమె ముఖం లో ఒక్క ఎక్స్ ప్రెషన్ పలకడం లేదు, కనీసం డబ్బింగ్ అయినా వేరే వాళ్ళతో చెప్పిస్తే బాగుండేది అని అనిపించింది. ఓవరాల్ గా ఈ చిత్రం రవితేజ కి మంచి కం బ్యాక్ అయ్యేలాగానే ఉంది. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.