రవితేజ ఆశలన్నీ ‘క్రాక్’ పైనే

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఆశలన్నీ ‘క్రాక్’ మూవీపైనే పెట్టుకున్నాడు. గతకొంతకాలంగా రవితేజకు సరైన హిట్టు దక్కడం లేదు. ఆచితూచి కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నా అనుకున్నంత విజయాలు దక్కకపోవడంతో రవితేజ అభిమానులు ఢీలా పడిపోతున్నారు. ఇటీవలే రవితేజ నుంచి వచ్చిన ‘డిస్కోరాజా’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆయన ఫోకస్ అంతా ‘క్రాక్’ మూవీపైనే పెట్టాడు. గోపిచంద్ మాలినేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీతో మళ్లీ హిట్టు కొట్టాలనే […]

Written By: Neelambaram, Updated On : February 14, 2020 11:06 am
Follow us on

మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం ఆశలన్నీ ‘క్రాక్’ మూవీపైనే పెట్టుకున్నాడు. గతకొంతకాలంగా రవితేజకు సరైన హిట్టు దక్కడం లేదు. ఆచితూచి కథలను ఎంపిక చేసుకొని సినిమాలు చేస్తున్నా అనుకున్నంత విజయాలు దక్కకపోవడంతో రవితేజ అభిమానులు ఢీలా పడిపోతున్నారు. ఇటీవలే రవితేజ నుంచి వచ్చిన ‘డిస్కోరాజా’ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఆయన ఫోకస్ అంతా ‘క్రాక్’ మూవీపైనే పెట్టాడు. గోపిచంద్ మాలినేని ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ మూవీతో మళ్లీ హిట్టు కొట్టాలనే కసితో మాస్ మహారాజ్ ఉన్నాడు.

ఈ మూవీలో రవితేజ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఈ మూవీలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన ‘క్రాక్’ ఫస్టు లుక్ కు మంచి స్పందన వచ్చింది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రవితేజ, గోపిచంర్ మలినేని కాంబినేషన్లలో వచ్చిన బలుపు, డాన్ శ్రీను మంచి విజయాన్ని సాధించాయి. దీంతో హ్యట్రిక్ మూవీగా ‘క్రాక్’ మూవీ రాబోతుంది. ఈ మూవీలో వరలక్ష్మీ శరత్ కుమార్, పూజిత పొన్నాడ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదేవిధంగా శృతిహాసన్, రవితేజ కాంబినేషన్లలో వచ్చిన ‘బలుపు’ మూవీ పెద్ద హిట్ అయింది. దీంతో ‘కాక్’ మూవీపై భారీ అంచనాలున్నాయి.

‘క్రాక్’ మూవీపైనే రవితేజ ఫోకస్ పెట్టినప్పటికీ మరికొన్ని కథలను వింటున్నారు. ఇప్పటికే ఇద్దరు దర్శకులను లైన్లో పెట్టాడు. ఈ ఏడాదిలో మూడు సినిమాలు చేయాలని రవితేజ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు, కథ నచ్చితే వెంటనే రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘క్రాక్’ ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. వేసవి సెలవుల నాటికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నహాలు చేస్తుంది.