మాస్ మహా రాజా రవితేజ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకున్న ప్రతిసారీ ఫెయిల్యూర్ చవిచూశాడు. నా ఆటోగ్రాఫ్ , శంభో శివ శంభో , ఆ అబ్బాయి చాలా మంచోడు, నేనింతే లాంటి డిఫరెంట్ చిత్రాలు చేసి అపజయాల్ని మూటగట్టుకున్నాడు. ఇటీవలే ‘డిస్కో రాజా’ అంటూ డిఫరెంట్ మూవీ చేస్తే అది కాస్తా రవితేజ కెరీర్ లోనే పెద్ద డిజాస్టర్ అయింది. ఆ దెబ్బతో ఇక తన స్టయిల్లోనే పక్కా మాస్ మసాలా సినిమాలు చేయాలని ఫిక్సయిపోయాడు రవితేజ. అందులో భాగంగానే గోపీచంద్ మలినేనితో ‘క్రాక్’ అనే సినిమా చేసాడు. ఇటవలే విడుదలైన దీని టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.కాగా ఈ చిత్రం 2016 వచ్చిన తమిళ సూపర్ హిట్ ‘సేతుపతి’కి రీమేక్ అని వినికిడి..ఇక దీని తర్వాత రవి తేజ చేయబోయే మరో సినిమా కూడా తమిళ రీమేకే అని తెలుస్తోంది.
గతంలో రవితేజ తో ‘వీర’ సినిమా తీసిన రమేష్ వర్మతో మరో సినిమాకు మాస్ మహా రాజా పచ్చజెండా ఊపాడు.విశేషం ఏమిటంటే రమేష్ వర్మ కెరీర్ అంతా ఫ్లాపుల మయం. కెరీర్ ఆరంభం లో ఓ కొరియన్ సినిమాను కాపీ కొట్టి తీసిన ‘రైడ్’ ఓ మాదిరిగా ఆడింది. గత ఏడాది తమిళ ‘రాక్షసన్’ సినిమాను మక్కీ మక్కీ దించుతూ రమేష్ వర్మ తీసిన ‘రాక్షసుడు’ సినిమా పర్వాలేదనిపించింది. దీంతో తన కథల్ని నమ్ముకోకుండా మళ్లీ రీమేక్ సినిమా తోనే రవితేజను రమేష్ వర్మ ఇంప్రెస్ చేసినట్టు తెలుస్తోంది.
తమిళంలో రెండేళ్ల కిందటే పూర్తయినా విడుదలకు నోచుకోని ‘శతురంగ వేట్టై’ సినిమా ప్రివ్యూ చూసి ఆ కథను రవి తేజ ఇమేజ్ కి అనుగుణంగా మార్చే ప్రయత్నంలో ఉన్నాడట రమేష్ వర్మ. తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రానికి ‘ఖాకి’ మూవీ ఫేమ్ హెచ్ .వినోద్ దర్శకుడు.కాగా ఇది దర్శకుడు వినోద్ తొలి సూపర్ హిట్ చిత్రం ‘శతురంగ వేట్టై’ (తెలుగులో బ్లఫ్ మాస్టర్)కు సీక్వెల్.
Remakes are always safe bets