Mr Bachchan: మిష్టర్ బచ్చన్ ట్రైలర్ వచ్చేది ఎప్పుడో చెప్పేసిన హరీష్ శంకర్…

Mr Bachchan: రవితేజతో 'మిస్టర్ బచ్చన్' అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమవుతుంది.

Written By: Gopi, Updated On : July 10, 2024 6:52 pm

Mr Bachchan Movie Trailer Release Date

Follow us on

Mr Bachchan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నారు. అయితే ఒక సినిమాని కమర్షియల్ ఎలిమెంట్స్ తో నింపేయాలి అంటే మాత్రం అది ఒక హరీష్ శంకర్ కే సాధ్యమవుతుంది. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించడమే కాకుండా ఆయా హీరోలకి కూడా కెరియర్ పరంగా చాలా వరకు హెల్ప్ అవుతాయనే చెప్పాలి. ఇక ఆయన సినిమాల్లో ఆర్టిస్టులు చాలా కొత్తగా కనిపిస్తూ ఉంటారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమాని చేస్తున్నాడు. అయితే ఈ సినిమా రీసెంట్ గానే షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి కూడా సిద్ధమవుతుంది. మరి ఇలాంటి క్రమం లోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక దానికి స్పందించిన హరీష్ శంకర్ ఈ నెల చివర్లో ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టుగా ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులందరిని విపరీతంగా అలరించింది. ఇక దాంతో పాటుగా ట్రైలర్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొంది సినిమా మీద మరింత హైప్ ని క్రియేట్ చేస్తుందనే ఉద్దేశ్యం లో రవితేజ అభిమానులైతే ఉన్నారు. ఇక గత మూడు నాలుగు సినిమాల నుంచి రవితేజకి సరైన సక్సెస్ అయితే దక్కడం లేదు.

ఇక ఈ సినిమాతో కమర్షియల్ గా రవితేజ సూపర్ సక్సెస్ ని అందుకొని, అలాగే హరీష్ శంకర్ కూడా మరోసారి తన స్టామినా ఏంటో ప్ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ సినిమా ను పట్టలెక్కించి బ్యాలెన్స్ ఉన్న షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు…