https://oktelugu.com/

‘ఆహా’.. ఏమైనా ఆఫరా

2020 మొదట్లో సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు వారి టార్గెట్‌ను చాలా సులువుగా అందుకున్నారు. ఇక నితిన్ భీష్మ సినిమాతో ఎండింగ్ టచ్ ఇచ్చినట్లయ్యింది. ఆ తరువాత కరోనా రావడంతో బాక్సాఫీస్ రికార్డుల మజా మిస్సయ్యింది. ఇక ఈ సంక్రాంతికి అందరి చూపు రవితేజ సినిమాపైనే ఉంది. ఆ సినిమా తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాక్సాఫీస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 3, 2021 / 06:09 PM IST
    Follow us on


    2020 మొదట్లో సంక్రాంతికి బాక్సాఫీస్ ఫైట్ ఏ రేంజ్ లో నడిచిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అల్లు అర్జున్, మహేష్ బాబు వారి టార్గెట్‌ను చాలా సులువుగా అందుకున్నారు. ఇక నితిన్ భీష్మ సినిమాతో ఎండింగ్ టచ్ ఇచ్చినట్లయ్యింది. ఆ తరువాత కరోనా రావడంతో బాక్సాఫీస్ రికార్డుల మజా మిస్సయ్యింది. ఇక ఈ సంక్రాంతికి అందరి చూపు రవితేజ సినిమాపైనే ఉంది. ఆ సినిమా తెలుగు స్టేట్స్ ప్రీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాక్సాఫీస్ ఆయుధం అదే. మాస్ మహారాజా రవితేజ ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా రికార్డులను అందుకోవడం లేదు. ఎంత డిఫరెంట్ గా చేసినా కూడా వర్కౌట్ కావడం లేదు. చివరగా రాజా ది గ్రేట్ తరువాత మళ్ళీ విజయాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం క్రాక్. ఈ సినిమాపై అభిమానుల్లో అయితే అంచనాలు భారీగానే ఉన్నాయి.

    Also Read: ఈసారి డ్రెస్ లేపి చూపించిన హాట్ బ్యూటీ

    ట్రయిలర్ విడదులవుతూనే యూ ట్యూబ్ లో వైరల్ అయిపోవడంతో రవితేజ ‘క్రాక్’ మీద అంచనాలు పెరిగాయి. పండుగకు సరైన మాస్ సినిమా అనే టాక్ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో క్రాక్ డిజిటల్ రైట్స్ కు కాస్త డిమాండ్ పెరిగినట్లు బోగట్టా. తెలుగు ఓటిటి ఆహా తొలిసారి ఓ పెద్ద సినిమా కొనడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏడున్నర కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం.

    Also Read: సింగర్ గా మారుతున్న వింక్ బ్యూటీ.. గాత్రంతో మాయ చేస్తుందా..?

    అల్లు అరవింద్ కు నిర్మాత టాగూర్ మధుకు ఉన్న సాన్నిహిత్యంతో ఈ డీల్ డిస్కషన్లు ప్రారంభమైందట. ఇదిలా వుంటే డిజిటల్ హక్కుల రీత్యా పది కోట్లు రావాలని నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెజాన్ తో కూడా బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల రేంజ్ లో ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఏది ఏమైనా ఇన్నాళ్లు చిన్న సినిమాలతో కాలం వెళ్లదీసుకుంటూ వచ్చిన ప్రేక్షకులకు.. ఈ సంక్రాంతి మాత్రం మాస్‌ మహారాజ సినిమాతో అలరించనుంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్