దీంతో.. వకీల్ సాబ్ తర్వాత రావాల్సిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా వెనక్కు వెళ్లిపోయాయి. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన.. లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం వంటి సినిమాలు రిలీజ్ కాలేదు. మే నెలలోనైనా పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయేమోనని ఆశిస్తే.. జూన్ లో కూడా పరిస్థితులు చక్కబడేట్టు కనిపించట్లేదు. దీంతో.. మేలో రిలీజ్ కావాల్సిన సినిమాలన్నీ వెనక్కు వెళ్లిపోతున్నాయి.
తాజాగా.. మాస్ మహరాజ్ రవితేజ అప్ కమింగ్ మూవీ ‘ఖిలాడీ’ని కూడా వాయిదా వేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. రమేష్ వర్మ డైరెకషన్లో తెరకెక్కిన ఈ చిత్రం షెడ్యూల్ ప్రకారం ఈ నెల 29న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ.. పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో.. వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు.
సెకండ్ వేవ్ ఉధృతి వచ్చే జూన్ లో కూడా పూర్తిగా తగ్గిపోయే పరిస్థితి కనిపించట్లేదు. జులైనాటికి ఏమైనా పరిస్థితులు అనుకూలిస్తే.. అప్పుడు రిలీజ్ చేసుకుందామని చూస్తున్నారట మేకర్స్. మొత్తానికి చిత్ర పరిశ్రమకు అత్యంత కీలకమైన సమ్మర్ ను రెండోసారి కూడా మింగేసింది కరోనా మహమ్మారి. మరి, వాయిదా పడిన చిత్రాలన్నీ ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.