Balakrishna- Ravi Teja: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమాలో కీలక పాత్రలో మరో హీరో కూడా కనిపించబోతున్నాడు. ఆ హీరోతో అనిల్ గతంలో ఓ సినిమా చేశాడు. కానీ.. ఆ సినిమా అనిల్ చేయలేదు, అనిల్ తో ఆ హీరో చేయించాడు. ఆ హీరోనే రవితేజ అని మేము గతంలోనే ఈ వార్తను తెలియజేశాము. అయితే.. ఇప్పుడు ఈ వార్త నిజం అని మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటు మాస్‌రాజ రవితేజ కూడా నటిస్తున్నాడు అని.. దీనిపై త్వరలోనే అధికారకంగా ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగా ఉంటుంది.
Also Read: BJP Govt Bans 24 Youtube Channels: 22 యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం నిషేధం.. ఆ విధంగా చేస్తున్నారట..
పైగా బాలయ్యతో పాటు రవితేజ కూడా సినిమాలో ఉంటాడు. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండే అవకాశం ఉంది. ఇక జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి – బాలయ్య బాబు – రవితేజ లాంటి క్రేజీ కలయికలో సినిమా అంటే… ఆ కిక్కే వేరు. .
ఏది ఏమైనా తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. మరోపక్క ‘అఖండ’తో బాక్సాఫీస్ దగ్గర ‘నటసింహం’ కలెక్షన్ల సునామీ చూపించాడు. మొత్తానికి అఖండ ఇచ్చిన అఖండమైన విజయంతో బాలయ్య తన మిగిలిన సినిమాల విషయంలో కూడా వేగం పెంచాడు.

ప్రస్తుతం షార్ప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం డేట్లు కేటాయించాడు. నిజానికి బాక్సాఫీస్ వద్ద బాలయ్యకు అసలు రేంజ్ లేదు అని అఖండ ముందు వరకూ కొంతమంది కామెంట్స్ చేసేవారు. అయితే, ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు. అదే పుష్పకి కలిసి వచ్చినట్లు.. టికెట్ రేట్లును రెండు వందలకు, ఐదు వందలకు అమ్ముకుని ఉండి ఉంటే.. బాలయ్య 200 కోట్ల మార్క్ ను కూడా దాటేవాడేమో.
Also Read:Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: అనసూయతో యాడ్ కోసం చిరంజీవి ఎంత తీసుకున్నారో తెలుసా ?
[…] Ruhani Sharma: హీరోయిన్లకు పెద్దగా టైమ్ దొరకదు. దొరికినా వాళ్ళు ఖర్చు పెట్టి విహారయాత్రలు చేయడానికి పెద్దగా ఇష్టపడరు. కారణం.. హీరోయిన్ అనగానే వాళ్లకు అనేక వెకేషన్ ఆఫర్లు వస్తుంటాయి. సో.. ఆ ఆఫర్లను వాళ్ళు అందిపుచ్చుకుని ముందుకు పోతుంటారు. ఈ క్రమంలోనే హీరోయిన్లకు మాల్దీవులకు వెళ్లడం ఆనవాయితీ అయిపోయింది. […]
[…] Naina Ganguly- Apsara Rani: రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది చివరకు చర్చనీయాంశమే అవుతుంది. ఆయన మైండ్ లో ఎలాంటి ఆలోచనలు మెదులుతాయో చెప్పడం అంత సులువు కాదు. ఆయన తీసే సినిమాలు చాలా సార్లు వివాదాస్పదమే అవుతుంటాయి. అయితే ఈసారి మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు లెస్బియన్ అమ్మాయిల క్రైమ్ థ్రిల్లర్ కథతో నానా రచ్చ చేస్తున్నాడు. […]