Ravi Teja Ramarao On Duty Release Date:ఈ ఏడాది వరుస చిత్రాలను లైన్ లో పెట్టారు మాస్ మహారాజా రవితేజ. ఇటీవలే కిలాడీ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని మరో చిత్రమైన “రామారావు ఆన్ డ్యూటీ ” షూటింగ్ షెడ్యూల్ పాల్గొన్నారు రవితేజ. మాస్ రాజా నటిస్తున్న తాజా చిత్రం “రామారావు ఆన్‌డ్యూటీ”. కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ 68వ చిత్రంగా వాస్తవ అంశాల ఆధారంగా స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎల్ ఎల్ పి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.మాస్ మహారాజా జంటగా దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు గా నటిస్తున్నారు.ఈ సినిమాలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నరు అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్లకు ప్రేక్షక అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 25న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు యూనిట్ బృందం స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.వేణు తొట్టెంపూడి, తనికేళభరణి, నాజర్, నరేశ్ కీలక పాత్రలు నటిస్తున్నారు.ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా సామ్ సి.ఎస్ వ్యవహరిస్తున్నారు. అలానే రవితేజ మరో చిత్రమైన” కిలాడి” కూడా ఫిబ్రవరి 11న విడుదల కానుంది.ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.