https://oktelugu.com/

Mr. Bachchan Review : ‘మిస్టర్ బచ్చన్’ ఫుల్ మూవీ రివ్యూ

ఈ సినిమాతో రవితేజ కెరియర్ లో మరొక మంచి సక్సెస్ దక్కిందా? అలాగే హరీష్ శంకర్ కి ఒక మంచి సినిమాగా గుర్తింపును తీసుకొచ్చి పెట్టిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : August 15, 2024 8:34 am

Mr. Bachchan Review

Follow us on

Mr. Bachchan Review : సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న హీరో రవితేజ…అలాగే కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్… ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందే షాక్, మిరపకాయ్ లాంటి సినిమాలు వచ్చాయి. అందులో షాక్ సినిమా ఫ్లాప్ అవ్వగా, మిరపకాయ్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత హరీష్ శంకర్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన విషయం మనకు తెలిసిందే. వీళ్ళ కాంబోలో ఇప్పుడు ‘మిస్టర్ బచ్చన్’ అనే సినిమా వచ్చింది.

నిజానికి ఈ సినిమా బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా వచ్చిన రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఈ సినిమాతో రవితేజ కెరియర్ లో మరొక మంచి సక్సెస్ దక్కిందా? అలాగే హరీష్ శంకర్ కి ఒక మంచి సినిమాగా గుర్తింపును తీసుకొచ్చి పెట్టిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ గా తన బాధ్యతలను కొనసాగిస్తూ ఉంటాడు. ఒక బిజినెస్ మాన్ ఇంట్లో భారీగా నల్లధనాన్ని పట్టుకోవడంతో ఆ బిజినెస్ మ్యాన్ మిస్టర్ బచ్చన్ సస్పెండ్ చేయిస్తాడు… ఇక దాంతో మిష్టర్ బచ్చన్ తన ఊరు వెళ్ళిపోయి వాళ్ళ పేరెంట్స్ తో పాటు ఉంటాడు. అలాగే తనకి జాబ్ రాకముందు నడిపిన ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ని మళ్ళీ నిర్వహిస్తూ ఉంటాడు. ఇక ఈ క్రమంలోనే హీరోయిన్ అయిన భాగ్య శ్రీ అతనికి పరిచయం అవుతుంది. ఇక ఆ పరిచయం ప్రేమగా మతుంది. దాంతో పెద్దలు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు.

ఇక ఇంతలోనే అతి పెద్ద బిజినెస్ మాన్ అలాగే పొలిటిషన్ అయిన ముత్యం జగ్గయ్య(జగపతి బాబు) ఇంట్లో రైడ్ చేయడానికి సస్పెండ్ లో ఉన్న ‘మిస్టర్ బచ్చన్’ మీద ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసి అతన్ని ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా నియమిస్తారు. ఇక ముత్యం జగ్గయ్య ఇంటికి వెళ్లిన మిస్టర్ బచ్చన్ అతని ఇంట్లో నల్లధనాన్ని పట్టుకున్నాడా? లేదా అనే విషయం తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు హరీష్ శంకర్ కమర్షియల్ సినిమాలను తీయడంలో అతనికి ఒక స్టైల్ ఉంది. రీమేక్ సినిమాలని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి ఆ సినిమాని సక్సెస్ తీరాలకు చేర్చడంలో ఆయన మహా మేధావి.. ఇంతకుముందు బాలీవుడ్ లో హిట్ అయిన దబాంగ్ ను ‘గబ్బర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు. అలాగే తమిళం లో సూపర్ హిట్ అయిన ‘జిగర్తండ ‘ సినిమాని ‘గద్దల కొండ గణేష్ ‘ పేరుతో రీమేక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక దాంతో ఇప్పుడు రైడ్ సినిమాని రవితేజ తో మిస్టర్ బచ్చన్ పేరుతో రీమేక్ అయితే చేశాడు… ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమాలో అనుసరించిన స్క్రీన్ ప్లే గాని, స్క్రీన్ మీద ఆర్టిస్టులు ప్రెజెంట్ చేసిన విధానం కానీ ఏది కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది.

రవితేజని ఇన్ కమ్ టాక్స్ ఆఫీసర్ అంటూ మొదటి సీన్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం అయితే చాలా బాగుంది. అయినప్పటికీ ఆ తర్వాత నుంచి హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ నడిపే ప్రయత్నం చేశాడు. అది చాలా వరకు ప్రేక్షకుడికి విసుగు పుట్టించే విధంగా ఉంది. ఇక దానికి తోడుగా ఫస్ట్ హాఫ్ అంత హిందీ పాటలతో నింపేశాడు. హీరో ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ నిర్వహించే వ్యక్తి కావడం వల్ల ప్రతి సన్నివేశానికి పాటలు పాడుతూ ప్రేక్షకుడిని ఇరిటేట్ అయ్యేలా చేశాడు…

ఇక ఫస్ట్ హాఫ్ మొత్తం రొటీన్ రొట్ట ఫార్ములాతో నడుస్తూ ఉంటుంది. సత్య కామెడీ అనేది సినిమా చూసే ప్రేక్షకుడిని కొంతవరకు రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఇక ఇదే సమయం లో భారీ ఇంటర్ వెల్ బ్యాంగ్ ఇచ్చి వదిలేస్తాడు. ఇక ఆ తర్వాత సెకండాఫ్ ని కొంచెం ఫాస్ట్ గా రన్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ సెకండాఫ్ మొత్తం ఒకే ఇంట్లో ఉండడం వల్ల ప్రేక్షకుడికి సీన్లు మళ్లీ మళ్లీ చూసినట్టుగా బోర్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇక ప్రేక్షకుడి ఎంగేజ్ చేసే సీన్లైతే ఒకటి లేవు. ప్రేక్షకుడిని ఏ కొంచెం కూడా ఎమోషనల్ గా టచ్ చేయలేకపోయాయి. ఇక ప్లాట్ ఏ టెంపులేట్ లో వెళ్తుందో కూడా దర్శకుడు పట్టించుకోకుండా మొదటి నుంచి చివరి వరకు అప్స్ అండ్ డౌన్స్ ఏమీ లేకుండా తీసుకెళ్లాడు.

ఇక హరీష్ శంకర్ ఆర్టిస్టులను వాడుకున్న విధానం కూడా అంత పర్ఫెక్ట్ గా లేదు. చమ్మక్ చంద్ర లాంటి నటుడు ఉన్నప్పటికీ ఆయనను ఒకటి రెండు సీన్లకు మాత్రమే పరిమితం చేశారు. ప్రభాస్ శీను, చమ్మక్ చంద్ర కాంబినేషన్లో ఇంకా కామెడీ వర్కౌట్ చేయొచ్చు. కానీ దాని మీద దర్శకుడు ఎక్కువ ఫోకస్ పెట్టినట్టుగా కనిపించలేదు. ఇక మ్యూజిక్ అయితే చాలా వరస్ట్ గా ఉందనే చెప్పాలి. మిక్కిజే మేయర్ ని హరీశ్ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకొని బ్లెండర్ మిస్టేక్ అయితే చేశాడు. ఒక్క సాంగ్ కూడా వినడానికి వినసొంపుగా గా అయితే లేవు.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా వర్కౌట్ అయితే అవ్వలేదు. ఇక సిద్దు జొన్నలగడ్డ క్యామియో రోల్ కొంతవరకు పర్లేదు అనిపించేలా ఉంది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే రవితేజ చేసిన మిస్టర్ బచ్చన్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అలాగే మొదటి సినిమాతోనే కుర్ర కారు మతులను పొగుడుతున్న హీరోయిన్ భాగ్య శ్రీ…ఇక ఈమె లుక్స్ కూడా చాలా బాగున్నాయి… ఇక ఫ్యూచర్ లో ఆమెకు కొన్ని మంచి సినిమాలు పెడితే మాత్రం స్టార్ హీరోయిన్ గా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక జగపతిబాబు విలనిజాన్ని బాగా పండించాడు.

ఇక అక్కడక్కడ ఆయన క్యారెక్టర్ లోని డైలాగ్స్ అరవింద సమేత లో జగపతిబాబు పోషించిన క్యారెక్టర్ కి సింక్ అయినట్టుగా అనిపించింది… తనికెళ్ల భరణి తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక ముఖ్యంగా కమెడియన్ సత్య అయితే ఈ సినిమాలో కీలక పాత్ర వహించాడనే చెప్పాలి. కాసేపు తన కామెడీ తో నవ్వులు పూయించాడు… ఇక మిగతా పాత్రల్లో నటించిన అందరూ ఒకే అనిపించేలా నటించారు. అంతేతప్ప సినిమా కి టర్నింగ్ పాయింట్ గా మారలేకపోయారు…

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మిక్కీ జే మేయర్ అసలు ఏ మాత్రం మంచి మ్యూజిక్ అయితే అందించలేకపోయాడు. కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ అందించే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నప్పటికి హరీష్ శంకర్ ఏరీకోరి మరి మెక్కిజే మేయర్ ని పెట్టుకోవడానికి గల కారణం ఏంటో ఎవరికి అర్థం కావడం లేదు… ‘మిక్కీ జే మేయర్’ మ్యూజిక్ డైరెక్టర్ గా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సినిమాటోగ్రాఫర్ ‘అయంక బోస్’ కూడా సినిమా కోసం పెద్దగా వైవిధ్యమైన షాట్స్ అయితే వాడలేదు. ఇక ఆయన విజువల్స్ కూడా రొటీన్ గా అనిపించాయి.

అలాగే ఎడిటర్ ‘ఉజ్వల్ కులకర్ణి’ కూడా పెద్దగా మ్యాజిక్ చేయలేకపోయాడు. ఇక ఈ సినిమాలో కొన్ని అనవసరమైన సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి సినిమాను ఇంకొంచెం షార్ప్ ఎడిట్ చేసినట్లైతే ఇంపాక్ట్ బాగుండేది…ఇక కే జి ఎఫ్ సినిమా కి ఎడిటర్ గా పని చేశాడనే కారణం తో ఉజ్వల్ ని ఏరికోరి మరి హరీష్ శంకర్ ఈ సినిమా కోసం తీసుకున్నాడు. అయినప్పటికీ ఆయన పనితనం మాత్రం పెద్దగా కనిపించలేదు… ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే అనిపించేలా ఉన్నాయి…

ప్లస్ పాయింట్స్

రవితేజ యాక్టింగ్…
రవితేజ ఇంట్రాడక్షన్ సీన్…

మైనస్ పాయింట్స్

స్క్రీన్ ప్లే
ఫస్ట్ హాఫ్
మ్యూజిక్
ఎమోషన్ గా కనెక్టివిటీ లేకపోవడం…

రేటింగ్.
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5

చివరి లైన్

రవితేజ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఒక్కసారి చూడవచ్చు…