Ravi Teja Krishna Movie: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపును సంపాదించు కొవాలని చూస్తారు. ఇప్పటికే చాలా మంది నటీమణులు ఇండస్ట్రీ లో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం చేస్తున్న హీరోయిన్లతో పాటు పోటీ పడుతూ వాళ్లు తమ కెరియర్ ను ముందుకు సాగిస్తుండటం విశేషం… ఒకరకంగా నయనతార, త్రిష లాంటి హీరోయిన్లు ఇండస్ట్రీ కి వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పుడున్న హీరోయిన్లకు సైతం పోటీ ని ఇస్తూ ముందుకు సాగుతున్నారంటే వాళ్లకు సినిమా ఇండస్ట్రీ పైన ఎంత ఇష్టం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్లతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లందరూ ఫేడౌట్ అయిపోయి పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయిన కూడా వీళ్ళు మాత్రం ఇంకా హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. నయనతార పెళ్లి చేసుకున్న కూడా ఆమెకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు…ఇప్పటికి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో రాణించాలనే ఉద్దేశ్యంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఒక తెలుగు సినిమాను నయనతార రిజెక్ట్ చేస్తే త్రిష కి అవకాశం వచ్చింది.
ఆ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించింది. ఇంతకీ ఆ సినిమా ఏంటి ఆ సినిమాను నయనతార ఎందుకు రిజెక్ట్ చేసిందనే విషయాలను మనం ఒకసారి తెలుసుకం వివి వినాయక్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమాలో మొదట హీరోయిన్ గా నయనతారను అనుకున్నారు.
కానీ రెమ్యూనరేషన్ విషయంలో ఎట్టకేలకు ప్రొడ్యూసర్లు సైతం ఆమెను పక్కన పెట్టేసి ఆమె ప్లేస్ ను త్రిష తీసుకున్నారు. త్రిషకి ఈ సినిమాతో మంచి విజయం దక్కింది. దాంతో ఆమె ఖాతాలో మరో నాలుగైదు సినిమాలైతే వచ్చి చేరాయి. ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ సినిమాలను వదులుకోవడం అనేది మంచిది కాదని చాలామంది సినిమా మేధావులు సైతం చెబుతూ ఉంటారు.
ఇక నయనతార అప్పటినుంచి తెలుగులో పెద్దగా కనిపించలేదు. తమిళ్ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం అయిపోయింది. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఏది ఏమైనా కూడా త్రిష మాత్రం మంచి అవకాశం అందుకొని ఇప్పటికి తను తెలుగులో కూడా టాప్ హీరోయిన్ గా వెలుగొందుతుండటం విశేషం…