Ravi Teja Remuneration: మాస్ మహారాజా గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు రవితేజ…సోలో గా ఇండస్ట్రీకి వచ్చి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరించి రవితేజ ఆ తర్వాత హీరోగా మారి ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్తుండటం విశేషం… గతంలో ఆయన మాస్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఇక రీసెంట్ గా తన పంథా ను మార్చి ఫ్యామిలీ కామెడీ జానర్ లో సినిమాను చేశాడు. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అంటూ వచ్చిన సినిమా పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. రవితేజ యాక్టింగ్ లో కొత్త ధనాన్ని చూపించాడు అంటూ విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నాడు… అలాంటి రవితేజ మరోసారి తన రెమ్యూనరేషన్ ని భారీగా పెంచినట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందు వరకు 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ ను ఛార్జ్ చేసిన రవితేజ ఇప్పుడు 40 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వస్తున్నాయి. నిజానికి రవితేజకు పెద్దగా మార్కెట్ లేదు. అతని సినిమాలకు సక్సెస్ఫుల్ టాక్ వచ్చిన కూడా 100 కోట్లు రావడం లేదు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రొడ్యూసర్ సైతం రవితేజతో సినిమాలు వర్కౌట్ కావడం లేదనే ఉద్దేశ్యంతో అతన్ని పక్కనపెట్టి కొంతమంది వేరే హీరోలతో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో రవితేజ చాలా కఠినంగా ఉంటాడనే వార్తలు కూడా వస్తున్నాయి.
ఒక్క రూపాయి తగ్గిన కూడా తనకు ఒప్పుకున్నా పారితోషికం కూడా అతను తీసుకోడని ఆ సినిమా చేయడని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటే రవితేజ మాత్రం నాసి రాజు కథలతో సినిమాలను చేస్తున్నాడు. ఇక మీదట మంచ కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తే బాగుంటుంది…