Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ, రమేష్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘ఖిలాడీ’. ఇవాళ రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే 4వ పాటను రిలీజ్ చేయాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితమే ‘ఖిలాడీ’ మూవీ గురించి చిత్ర యూనిట్ ఈ అప్‌డేట్‌ను విడుదల చేసింది.

ఈ నెల 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా.. తమ సినిమా నుంచి ‘ఫుల్ కిక్కు’ అంటూ సాగే పాట కిక్ ఇవ్వబోతుంది అని చెప్పుకొచ్చింది. అయితే, ఉదయం 10.08 గంటలకు ‘ఫుల్ కిక్కు’ రిలీజ్ కాలేదు. సాంగ్ ఎడిటింగ్ పనులు పూర్తి కాలేదు అని అందుకే, సాంగ్ రిలీజ్ సమయాన్ని మారుస్తూ తాజా మళ్ళీ చిత్రయూనిట్ ఒక అప్ డేట్ వదిలింది.
Also Read: శిల్పాశెట్టికి ఊరట.. 15 ఏళ్ల నాటి ముద్దు కేసులో ముద్దుగుమ్మ తప్పేమి లేదన్న న్యాయస్థానం..
ఈ రోజు సాయంత్రం 4.05 గంటలకు ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా చిత్రయూనిట్ ప్రకటించింది. అలాగే ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని చిత్రయూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. అంటే.. ఫిబ్రవరి 11న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి సాయంత్రం 4.05 గంటలకు రానున్న ఈ ‘ఫుల్ కిక్కు’ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలి. సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి. సాంగ్, టీజర్, ట్రైలర్ కూడా బాగుంటే.. సినిమాకి భారీ హైప్ క్రియేట్ అవుతుంది.

ఇక రవితేజ ప్రస్తుతం 6 సినిమాలు చేస్తున్నాడు. ఈ ఆరు సినిమాల నుంచి నేడు వరుసగా భారీ అప్ డేట్స్ వస్తున్నాయి. .సినిమాల లిస్ట్ వచ్చే సరికి ‘ఖిలాడీ’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’, ‘రావణాసుర’, టైగర్ నాగేశ్వరరావు, అలాగే బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమాలో కూడా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Also Read: 1980 స్ లో స్టార్ హీరోల రెమ్యూనరేషన్స్ లిస్ట్.. ఎవరికి ఎక్కువ అంటే ?